మిత్రులారా జీవని స్థాపించినప్పటినుంచి అత్యధిక విరాళాలు అందిన నెల ఇదే. మొత్తం 88,750/- అందాయి. దీన్ని 1,00,000/- చేయడానికి ప్రయత్నిస్తున్నాము. జీవనికి బ్లాగర్లు ఇస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. అలాగే జీవని విద్యాలయం ప్లానింగ్ ఎలా చేయాలా అని చర్చించే బృందం మన బ్లాగర్లే. వారి గురించిన వివరాలు సమయం వచ్చినపుడు తెలియజేస్తాము. స్థల సేకరణకు నానా తిప్పలు పడుతున్నాము. వారానికి మూడు రోజులు ప్లాట్ల వెంబడి తిరుగుతున్నాము. ఇక ఆదివారం వచ్చిందంటే టీం మొత్తం వెళ్తున్నాము. మరి ఎందుకో కలిసి రావడం లేదు. స్థలం సెట్ అవుతూనే నిర్మాణం ప్రారంభించాలన్నది...
ఒక పీరియడ్ లో బోధన కింది పద్ధతిలో జరిగితే ఫలితం ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.1) ఉపోద్ఘాతం: ఇందులో మరో 2 భాగాలుఅ) పిల్లలను ప్రశ్నలు లేదా చర్చ ద్వారా చెప్పవలసిన విషయాన్ని వారితోనే రాబట్టడం. ఉదా: ట్రాఫిక్ అనే అంశం చెప్పాల్సి వస్తే నీవు స్కూల్కు పొద్దున ఎలా వచ్చావ్, వచ్చేటపుడు రోడ్డు మీద గమనించిన అంశాలు ఏవి? ఇలా కొన్ని ప్రశ్నలు ట్రాఫిక్ అనే అంశంలోకి పిల్లల్ని తీసుకుపోతాయి.ఆ) ఆ తర్వాత ట్రాఫిక్ మీద టీచర్ ఉపోద్ఘాతం ఉంటుంది.2) పిల్లల్ని చర్చలో పాల్గొనేలా చేయడం3) అంతవరకు జరిగిన చర్చ మీద టీచర్ తన అభిప్రాయాలు చెప్పడం, ఇంకా కొత్త...
బాల్యానికి ఇసుకకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఇసుక తప్పనిసరిగా ఉండాలని గిజూభాయ్ చెప్తారు. నిజానికి ఇసుకను ఆస్వాదించడానికి చిన్నా పెద్దా తేడా ఉండదు. ఇసుకలో కూచున్నపుడు మనం కూడా పిచ్చిగీతలు గీస్తుంటాం. ఇక పిల్లలకు స్వర్గంలా ఉంటుంది. పిచ్చుక గూళ్ళు, గవ్వలు ఏరుకోవడం, పుల్లాట ఇలా సమయం గడచిపోతూనే ఉంటుంది వారికి. పిల్లలకు మట్టి అంటడం, వాటిలో సూక్ష్మ క్రిములు ఉంటాయా తదితర విషయాలు పక్కన పెట్టాలి. ఇసుక తినకుండా చూడాలి అంతే.ఇసుకలో ఆడుకోవడం వల్ల వ్యాయామం, కాన్సంట్రేషన్, గెస్సింగ్ తదితర నైపుణ్యాలు...
లోకల్గా ఎవరైనా విరాళం ఇచ్చినపుడు ఫోటో తీసి, ధన్యావాదాలు చెబుతూ దాతకు దాన్ని అందజేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. మన దగ్గరున్న నోకియా ఎన్ 73 పెద్ద సమస్య అయింది. సిస్టంతో కనెక్ట్ కావడం లేదు. అదీగాక కొద్దిగా చీకటయ్యాక అందులో ఫోటోలు సరిగా రావు. వీటిని దృష్టిలో పెట్టుకుని కెమెరా తీసుకుంటే బావుంటుంది అనుకున్నాము. సోదరుడు కర్ణా జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలల కిందట కెనెడా వెళ్ళాడు. విషయం చెప్పాను. అమెరికాలో మంచి ఆఫర్లు ఉన్నాయని, జగన్ అన్న రాజవర్ధన్ రెడ్డి తనే ఒకటి కొని పంపారు.( రాజ్ ముందునుంచీ U.S. లో ఉంటున్నారు ) వీరిద్దరూ జీవనికి...
బ్లాగులకు రెగ్యులర్ రీడర్ కుమార్ గారు. kumar N పేరుతో ఆయన కామెంట్లు కూడా బ్లాగర్లకు సుపరిచితమే. ఆయన తమ కుమార్తె చి. అముక్తమాల్యద పేరు మీద జీవనికి 25,000/- విరాళం అందించారు. వారికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామ...
1) ఎల్లప్పుడూ నవ్వండి2) మంచి చేసినవారిని అభినందించండి3) వీలైనంత సేవ చేయండిఈ సూత్రాలను ఉపాధ్యాయులు పాటించాలని విద్యావేత్తలు సూచించారు.వీటి స్ఫూర్తితోనే జీవనికి ఒక స్లోగన్ తయారు చేశాము అది..." అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత సేవ చేయండి...
న్యూయార్క్ లో పనిచేస్తున్న రాజేష్ కుమార్ గారు ఫోటో బ్లాగర్ http://rajeshkumar001.blogspot.com/. ఈయన జీవనికి 15,750/- విరాళం అందజేశారు. జీవని తరఫున రాజేష్ గారికి ధన్యవాదాలు తెల్పుతున్నాము. MARCH 2011 DAILY BALANCE SHEETBalance as on 28-2-11 14,183/-01-3-11 - expenditure office asst. salary 1000/- ( 13,183/- )02-3-11 - expenditure spl. fees for computers 2000/- ( 11,183/- )03-3-11 - 2000/- M.C.YAGANTAIAH 13,18304-3-11 - 1000/- K.V.NAGI REDDY 14,183/-05-3-11 - 1001/- S.SARVODAYA 15,184/-06-3-11 - 500/- P.SIVASANKAR, 500/- D.VENKATESWARLU...
పిల్లల సృజనాత్మకతకు అవధులు ఉండవు. కావల్సిందల్లా దాన్ని వెలికితీయడమే. మనం ఊహించని పరిష్కారాలను వారు చూపగలరు. పిల్లల్లోని సృజనాత్మకతకు పదును పెట్టి లాజికల్గా ఆలోచింపచేయడానికి ఒక పద్ధతి. ఒక వస్తువును ఎన్ని రకాలుగా వాడవచ్చో చెప్పమనాలి 1) పేపర్ వల్ల ఉపయోగాలు ఏవి? రాసుకోవచ్చు, దేన్నైనా తుడవటానికి, పుస్తకాలకు అట్టలు వేయడానికి ఇలా... ఇలాగే సూది, పిన్నీసు, పెన్ను, పెన్సిలు, రిబ్బను ఇలా మనం నిత్య జీవితంలో వాడే వస్తువులు. దీన్ని గిజూభాయి రాశారు. వీటిని ప్రయోగాత్మకంగా చూసినపుడు ఆశ్చర్యకరమైన సమాధానాలు వచ్చాయన్నార...
పొద్దుట్నుంచి సాయంత్రం దాకా స్కూళ్ళో తల వాచిన పిల్లలకు హోం వర్క్ అవసరమా? తల్లిదండ్రులను సంతృప్తి పరచడానికి హోం వర్క్ ఒక మార్గం. ఇంటికి రాగానే మళ్ళీ పుస్తకాలు ముందేసుకుని సోలుతూ తూగుతూ రాస్తుంటే అబ్బో మా బాబు / పాప ఏం చదువుతున్నారో అని మురిసిపోవడానికి ఉపయోగపడుతుంది. 6వ తరగతి నుంచి సిలబస్ భారం కాబట్టి అప్పటినుంచి ఇంట్లో మరోసారి పిల్లలు పాఠాలు చదువుకోవడం మంచిది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు హోం వర్క్ బదులుగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించేలా రోజూ అసైన్మెంట్లు ఇవ్వాలి.ఉదా.. వయసుకు సంబంధించిన అంశం వచ్చినపుడు ఇంట్లో ఉన్నవారి వయసులు...
మిత్రులారా జీవని విద్యాలయం ఎలా ఉండాలి అని సంవత్సరకాలంగా వివిధ పుస్తకాలు చదువుతూ వచ్చాను. వాటిలో కొన్ని విదేశీ వాతావరణం ( సమ్మర్ హిల్ అనుభవాలు, రైలు బడి ), మరికొన్ని దేశీయ వాతావరణానికి ( గిజూ భాయి, చుక్కా రామయ్య ) సంబంధించినవి. వీటిని చర్చలో పెడతాను. విద్యా వ్యవస్థ ప్రక్షాళన, సంస్కరణల మీద ఆసక్తి ఉన్నవారు ఇందులో పాల్గొని మరింత మెరుగైన సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. మూసకు భిన్నంగా జీవని విద్యాలయం ఉండాలని, ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని మా ఆశయం, కల. అందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. పాఠశాల పార్కులా ఉండాలి. అందులో ఆటలాడుకునే...
బ్లాగర్లకు సుపరిచితులైన ఒంగోలు శీను గారు జీవనికి 5000/- విరాళం అందజేశారు. ఆయన ఆధ్వర్యంలో సహాయ అనే స్వచ్చంద సంస్థ నడుస్తోందని మనందరికీ తెలుసు. సహాయ అంధుల కోసం కృషి చేస్తోంది. పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శీను గారికి జీవని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము....
ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న కావ్య గారు జీవనికి 13,000/- విరాళం అందజేశారు. కావ్య గారికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెల్పుతున్నాము.MARCH 2011 DAILY BALANCE SHEETBalance as on 28-2-11 14,183/-01-3-11 - expenditure office asst. salary 1000/- ( 13,183/- )02-3-11 - expenditure spl. fees for computers 2000/- ( 11,183/- )03-3-11 - 2000/- M.C.YAGANTAIAH 13,18304-3-11 - 1000/- K.V.NAGI REDDY 14,183/-05-3-11 - 1001/- S.SARVODAYA 15,184/-06-3-11 - 500/- P.SIVASANKAR, 500/- D.VENKATESWARLU 16,184/-07-3-11 - 500/-...