మిత్రులారా జీవని విద్యాలయం ఎలా ఉండాలి అని సంవత్సరకాలంగా వివిధ పుస్తకాలు చదువుతూ వచ్చాను. వాటిలో కొన్ని విదేశీ వాతావరణం ( సమ్మర్ హిల్ అనుభవాలు, రైలు బడి ), మరికొన్ని దేశీయ వాతావరణానికి ( గిజూ భాయి, చుక్కా రామయ్య ) సంబంధించినవి. వీటిని చర్చలో పెడతాను. విద్యా వ్యవస్థ ప్రక్షాళన, సంస్కరణల మీద ఆసక్తి ఉన్నవారు ఇందులో పాల్గొని మరింత మెరుగైన సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. మూసకు భిన్నంగా జీవని విద్యాలయం ఉండాలని, ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని మా ఆశయం, కల. అందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం.

పాఠశాల పార్కులా ఉండాలి. అందులో ఆటలాడుకునే అన్ని పరికరాలు ఉండాలి - ప్రోబెల్

విద్య వ్యాపార వస్తువుగా తయారు అయ్యాక, కార్పొరేట్ స్కూళ్ళు అపార్ట్ మెంటుల్లో, షాపింగ్ కాంప్లెక్సుల్లో జరుగుతున్నాయి. ఇక ఆటలకు అసలు అవకాశమే లేదు. చదువు తప్ప మరోలోకం తెలీని పిల్లలు మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కుంటున్నారు. నైతిక విలువలు బోధించడం లేదు. మార్కుల వేటలో మానసికంగా అనారోగ్యకరమైన ఒక తరాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నాము.

దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి?

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. చాలా బాగా చెప్పారు. ఒక మంచి లక్ష్యంతో మీరు ముందుకెళ్తున్నారు. మీకు, పిల్లలకు మంచి జరగాలని, పిల్లలు ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నాను.

   
 2. jeevani Says:
 3. శిశిర గారూ స్పందించినందుకు ధన్యవాదాలు

   
 4. మీ ఆశయం, కల మీ మాటల్లో కనిపిస్తున్నాయండీ. చాలా సంతోషం. పిల్లలకు కాంక్రీట్ బిల్డింగుల్లొ పాఠాలు చెప్పడం నాకస్సలు నచ్చదండీ.

  చక్కగా పూరిపాకలు, పచ్చని చెట్లు, పూల మొక్కలు, కొన్ని పెంపుడు జంతువులు, పక్షులు ఇలా ఉండాలని నా ఉద్దేశం. కానీ ప్రభుత్వం పక్కా బిల్డింగులు కావాలిఅని ఆదేశం జారీ చెయ్యడం నాకెంతో నిరాశ కలిగించింది. పెద్దైన తరువాత ఉద్యోగాల వేటలో ఎలాగో కాంక్రీటు జీవనం తప్పదు. కనీసం చిన్నప్పుడైనా చక్కని ప్రకృతి మధ్యలో కూర్చుని చదువుకునే అవకాశం ఉంటే బాగుంటుంది.

   

Blog Archive

Followers