లోకల్గా ఎవరైనా విరాళం ఇచ్చినపుడు ఫోటో తీసి, ధన్యావాదాలు చెబుతూ దాతకు దాన్ని అందజేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. మన దగ్గరున్న నోకియా ఎన్ 73 పెద్ద సమస్య అయింది. సిస్టంతో కనెక్ట్ కావడం లేదు. అదీగాక కొద్దిగా చీకటయ్యాక అందులో ఫోటోలు సరిగా రావు. వీటిని దృష్టిలో పెట్టుకుని కెమెరా తీసుకుంటే బావుంటుంది అనుకున్నాము. సోదరుడు కర్ణా జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలల కిందట కెనెడా వెళ్ళాడు. విషయం చెప్పాను. అమెరికాలో మంచి ఆఫర్లు ఉన్నాయని, జగన్ అన్న రాజవర్ధన్ రెడ్డి తనే ఒకటి కొని పంపారు.( రాజ్ ముందునుంచీ U.S. లో ఉంటున్నారు ) వీరిద్దరూ జీవనికి రెగ్యులర్ దాతలు. వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers