జీవని విద్యాలయం కొసం తీసుకున్న రెండు ఎకరాల రిజిస్ట్రేషన్ 100% పూర్తి అయింది. నిన్న డాక్యుమెంట్లు మన చేతికి వచ్చాయి. అయితే పొలం యజమానులకు మనం ఇంకా 2 లక్షలు ఇవ్వవలసి ఉంది. డాక్యుమెంట్లలో స్థలం విలువ 1 లక్షగా చూపుతున్నది, ప్రభుత్వం విలువగా గమనించగలరు.




ఈ నెల 29న శంఖుస్థాపనకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 22న జీవని కార్యవర్గ సమావేశం జరగనుంది. అతిథులు, కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నాము.
సోదరా...
మీరు చేస్తున్న కృషి నిజంగా అద్భుతమైనది. మీరు జీవని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ తపనకు, కృషికి అభినందనలు. నేను ప్రస్తుతం ఒక టీటీ అకాడమీని ఏర్పరిచే క్రమంలో బాగా డబ్బు ఖర్చుచేస్తున్నాను. దీని నుంచి తేరుకోగానే...తప్పకుండా నా వంతుగా ఏదైనా చేస్తాను. నిత్యం నిబద్ధతతో పనిచేసే శక్తి మీకు కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ కార్యక్రమాలు బాగా కొనసాగాలని ఆశిస్తున్నాను.
బాస్, పిల్లలకు మాత్రం ఇంగ్లిష్ బాగా నేర్పండి. ఈ తెలుగు నేర్చుకుని, వాగ్ధాటి లేకపోతే ఇబ్బందిపడతారు. భాషపై ప్రత్యేక దృష్టిపెట్టండి.
రాము
apmediakaburlu.blogspot.com
అన్నయ్యా ధన్యవాదాలు.
మీ సలహా దృష్టిలో పెట్టుకుంటాను.