మిత్రులారా జీవని సభ్యుల సమావేశం ఈ సాయంత్రం SRIT corporate officeలో జరిగింది.

ముఖ్యాంశాలు.

1) ఈ నెల 29న చేయాలనుకున్న జీవని విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది. జూన్ 19 అని అంచనా వేశాము. దీనికి గల కారణాలు ఎక్కువ సమయం దొరకడం వల్ల విస్తృతంగా ఆహ్వానాలు అందించవచ్చు. పిల్లలు ఆ పాటికి స్కూల్కు వచ్చి ఉంటారు. కార్యక్రమంలో వారు కూడా పాలుపంచుకుంటారు. వీరికి తోడు కొత్త పిల్లలు కూడా వస్తారు.

2) పబ్లిసిటీకి దూరంగా వుండాలన్న మన నియమాన్ని సవరించాలని అందరూ సూచించారు. జీవని గురించి ప్రజలకు తెలియాలి. అలాగే దీనివల్ల కొత్త దాతలు వస్తారు. ఇందుకోసం జిల్లాలో పనిచేస్తున్న పై స్థాయి యంత్రాంగం మొత్తాన్ని శంఖుస్థాపనకు ఆహ్వానించాలి. ఈ కార్య్క్రమానికి పిలవాల్సిన వారి జాబితా ఇలా ఉంది.

Mancho Ferror ( Programmae Director, RDT ), State Representative of CRY, Subba Raju ( NGO ), collector, sp, District Revenue Officer, RDO, DEO, project officer - Rajiv vidya mission, pd - DRDA, MRO,MEO,MDO, sarpanch etc...

3) జీవని విద్యాలయానికి విరాళం ఇస్తామని ఇప్పటికే కొందరు దాతలు ముందుకు వచ్చారు. స్కూల్కు సంబంధించి ఇంకా ఎలాంటి పనులు మొదలు పెట్టకపోయినా మన మీద వ్యక్తిగత నమ్మకంతో వీరు విరాళం ఇస్తున్నారు. వీరిని సంప్రదించి శంకుస్థాపన రోజు చెక్కులు అందించేలా చేయడం.

4) కొత్తగా పిల్లల్ని తీసుకోవడానికి ముందుసారిలా పేపర్ ప్రకటన ఇవ్వడం లేదు. జీవని సభ్యులే పిల్లల్ని ఐడెంటిఫై చేశారు. వీరిలోనే ఎంపిక చేయడం జరుగుతుంది.



Saptagiri Reddy, Sreenivasula Reddy, Raja vardhan Reddy, Sambasiva Reddy


Ramana reddy, Chandrakanth, sreenivasulu, Gange Naik




Ramanjaneyulu, Meda Prasad, Naidu, Sreenivasulu, Ramesh


సేవా రంగంలో పేరు ప్రఖ్యాతులు, పాపులారిటీ ఉన్న వ్యక్తిని సూచించవలసిందిగా కోరుతున్నాము.



on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo