జీవని విద్యాలయం శంకుస్థాపనకు రావడానికి RDT programme director మాంచో ఫెర్రర్ గారు అంగీకరించారు. కాసేపటి క్రితం మేము ఆయన్ని కలిశాము. జీవని సభ్యులు నాగేశ్వర రెడ్డి, సాంబశివా రెడ్డి, ప్రసాద్ మరియు పాత్రికేయ మిత్రులు రాంగోపాల్ బృందం కలిసింది. దాదాపు 20 నిమిషాల సేపు ఆయనకు జీవని గురించి వివరించాము. పిల్లలు భవిష్యత్తులో స్థిరపడే వరకు సపోర్ట్ చేయాలన్నది మా విజన్ అని చెప్పినపుడు ఫెర్రర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మీలాంటి యువకులు ఈ రంగంలో రావడం బావుంది అన్నారు.

ఇక RDT గురించి చెప్పాలంటే ఆ సంస్థ ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి వనరులు, పేదలకు మౌలిక వసతులు, పర్యావరణం, క్రీడలు ఇంకా అనేక రంగాల్లో విశేష కృషి చేస్తోంది. RDT వార్షిక బడ్జెట్ దాదాపు 400 కోట్లు. స్పెయిన్ కు చెందిన దివంగత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ని స్థాపించారు. అనంతపురం జిల్లలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఫాదర్ ఫెర్రర్ ను దేవుడిలా భావిస్తారు.

మాంచొ గారికి జీవని ఫోటో ఆల్బం చూపించాము. కర్నూల్ వరదబాధితులకు మీరు కూడా సహాయం చేశారా? అని ఫోటోలు చూసి అడిగారు. జీవని తరఫున గుండ్రేవుల గ్రామానికి సహాయం అందించిన విషయం మీకు తెలిసిందే. RDT ప్రస్తుతం అక్కడ 1000 ఇళ్ళు నిర్మిస్తోంది. మేము మొదట వెళ్ళిన ఊరు గుండ్రేవుల అని మాంచో గారికి చెప్పాము.


on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. Sitaram Says:
 2. బాస్,
  నేను ఈ తండ్రీ కొడుకులను రెండేళ్ల కిందట అనుకుంటా కలిశాను. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, క్రీడాభివృద్ధికి వారు చేస్తున్న కృషి అద్భుతమైనవి. తన తండ్రి మరణానంతరం కుమారుడు కూడా అదే బాటలో పనిచేయడం అభినందనీయం.
  నేను మూడు నాలుగు నెలల తర్వాత వారు నిర్వహించే ఒక టోర్నమెంటుకు మా వాడిని తీసుకువస్తాను. అప్పడు మరొకసారి కలుస్తాను.
  రాము

   
 3. Anonymous Says:
 4. ఈ మలుపులో మీరు జాగ్రత్తవహించాలి
  సేవపేరుతో మతప్రచారం చేసే సంస్థలప్రభావానికి లొంగకుండా మతబేహారులమాయలో పదకుండా సేవను సేవగానే సాగేలా చూడాలని మనవి

   
 5. jeevani Says:
 6. ramu annayya you are welcome
  @ anon
  sure. thank you

   
 7. KumarN Says:
 8. I feel so glad when people step up to help others Jeevani garu.
  Thanks for leading.

   

Blog Archive

Followers