గుంటూరు వాసులకు చందు హనుమాయమ్మ గారి గురించి తెలిసే ఉంటుంది. చైతన్య స్ఫూర్తి అనే స్వచ్చంద సంస్థను వారు నిర్వహిస్తున్నారు. తమ భర్త చందు సత్యనారాయణ గారితో కలసి వారు దీన్ని స్థాపించారు. సత్యనారాయణ గారు ఆంగ్లంలో పండితులు. హనుమాయమ్మ గారికి స్టేజి ఫియర్ పోగొట్టి  సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సాహం  ఇచ్చారు. రెండేళ్ళ క్రితం వారు పరమపదించాక మొత్తం బాధ్యతను హనుమాయమ్మ గారే తీసుకున్నారు.  తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక పాఠశాల నడుపుతున్నారు. ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం , ముఖ్యంగా క్లాత్స్ బ్యాంక్ గురించి తప్పక చెప్పుకోవాలి. దాతలు తమ పాత దుస్తులు ఇక్కడ ఇస్తారు. బట్టలు కావలసిన పేద పిల్లలు తమ పేరు నమోదు చేసుకుని ఉచితంగా తీసుకోవచ్చు.
ఇక ఆల్ రౌండర్ అని ఎందుకు అన్నామంటే సీనియర్ సిటిజన్ కేటగిరిల్లో నిర్వహించే క్రీడల్లో వీరిదే పైచేయి. వీరు పోటిలో ఉన్నారంటే ఒక ప్రైజు పోయినట్టే అని అందరూ అనుకుంటూ ఉంటారట.
వివిధ రకాల సంఘాలు అంటే సీనియర్ సిటిజన్ల సంఘం, వాకర్స్ క్లబ్, లాఫింగ్ క్లబ్ లాంటి వాటిలో చురుగ్గా పాల్గొంటూ ఎప్పుడు బిజీగా ఉంటారు.
తరచుగా మీటింగులకు హాజరై ఉపన్యాసాలు ఇస్తుంటారు.
తమ పుట్టుకకు కారణం ఉందని, ఒక మిషన్ మీద ఈ ప్రపంచంలో అడుగుపెట్టామని తెలుసుకుని జీవించే వాళ్ళు లక్షకు ఒకరో ఇద్దరో...
అలాంటి కొద్దిమందిలో ఒకరైన హనుమాయమ్మ గారి గురించి , వారి జీవిత శైలి గురించి తెలుసుకున్నపుడు రాస్తున్నపుడు ఉత్తేజం పరవళ్ళు తొక్కింది. అంత పెద్దావిడ ఎన్నో ఎన్నెన్నో సాధిస్తున్నారు. మన వయసుకు ఇంకా ఇంకా చేయాలి... చేయాల్సింది చాలా చాలా ఉంది అనిపించింది.
ఇలా  సేవ చేయాలనుకునే వారికి ఆదర్శమూర్తిగా నిల్చి మాకు కొత్త స్ఫూర్తిని ఇచ్చిన  హనుమాయమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెల్పుకుంటున్నాము.
 చందు హనుమాయమ్మ, సత్యనారాయణల గారి కుమార్తె,  బ్లాగర్ శైలజ చందు గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు.












 

 `Cloth bank' opened
Staff Reporter

People can donated their used garments at the bank for poor and needy persons
GUNTUR: A `cloth bank', to take care of clothing needs of the poor was inaugurated in the city on Wednesday. People can donate their used clothes at the bank, set up by Chaitanya Spoorthi, a charitable organisation. Poor people, especially those from in slum areas, can walk into the bank and choose the required clothes. After noting down their names and addresses, volunteers will hand over the clothes.
The programme was formally launched by D. Someswari, Head of the Botany Department, Tellakula Jalayya Polisetty Somasundaram (TJPS) College, at the Chaitanya Spoorthi office at Kothapet. She said that providing help to the needy in whatever way one can was the truth preached by all the religions.
Telugu Bala Mahila Pragathi Pranganam Manager K. Krishna Kumari said such welfare activities would meet the basic needs of many poor people. Chaitanya Spoorthi president Chandu Hanumayamma called upon people to donate their used clothe

 

Online edition of India's National Newspaper
Tuesday, Jul 11, 2006

Clothes distribution
Clothes valued at Rs.10,000 were distributed to poor children at the Municipal Corporation Primary School in Bharathpet by `Chaitanya Spoorthi', a social and cultural service organisation in the city on Monday.
The clothes were collected from various people who have donated their used clothes to the `Cloth Bank' started by the organisation a few weeks ago, said Chaitanya Spoorthi treasurer Chandu Hanumayamma.






on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. Sravya V Says:
  2. Interesting , హునుమాయమ్మ గారి గురించి తెలుసుకోవటం చాలా బావుందండి . వారికి శైలజ గారికి అభినందనలు !

     
  3. Thanks for Introducing such a wonderful couple Prasad Garu

    Best wishes

     
  4. Anonymous Says:
  5. She is So great

     
  6. nirmal Says:
  7. Chaitanyasphoorthi ki bidda ga puttatam Chandu s gari poorvajanma sukrutam

     
  8. nirmal Says:
  9. Chaitanyasphoorthi ki bidda ga puttatam Chandu s gari poorvajanma sukrutam

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo