నిన్న సాయంత్రం పిల్లల్ని పార్క్ కు తీసుకెళ్లాము. శ్రీనివాసుల రెడ్డి ( సబ్ రిజిస్ట్రార్, అనంతపురం రూరల్ ), సాల్మన్ రాజు ( ప్రిన్సిపాల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, అనంతపురం ) గార్లు తమ కుటుంబ సభ్యులతోనూ, ఎప్పటిలా మా కుటుంబం వెళ్ళాము. వర్షం బాగా అంతరాయం కలిగించినా చివర్లో తగ్గిపోయింది. పిల్లలు ఆట పాటలతో పార్కుకు వచ్చిన ఇతరులను కూడా ఆకట్టుకున్నారు. ఇతర పిల్లలు తల్లిదండ్రులు మా చుట్టూ మూగారు.


శివకుమార్ అని ఒక చిచ్చర పిడుగు ఉన్నాడండీ! వై.యస్., చంద్రబాబు, గార్లను అద్భుతంగా అనుకరిస్తూ మిమిక్రీ చేశాడు. అలాగే ఒక మంచి పాట పాడాడు. మగధీర సినిమాలోని జోర్సె పాటకు డ్యాన్స్ చేసాడు. శివ ప్రతిభను ఈ సారి SRIT ( SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY) లో జరిగే కాలేజీ డేలో ప్రదర్శింపచేయాలని అనుకున్నాము.


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers