చివరి శ్వాస వరకూ ధైర్యమే ఊపిరిగా జీవించి, వేలాది మంది పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టిన శైలజ గారి గురించి ఇది వరకే చెప్పుకున్నాము.
 from old post....

(   శైలజ గారు చాల సంవత్సరాల నుంచి కేన్సర్ తో పోరాడి చివరకు ఓడిపోయారు. కిందటి నెల పరమపదించారు. 
తాడిపత్రిలో అన్ని  ప్రభుత్వ బడులకు మధ్యాహ్న భోజనం  ఒకేచోట తయారవుతుంది. దాని నిర్వహణ శైలజ గారు చూసుకునేవారు. రోజు అన్నం పప్పు / సాంబారు/ రసంతో పాటు పెరుగన్నం ఇచ్చేవారు. అరటిపండు గుడ్డు వారంలో రెండుసార్లు, ఒకసారి స్వీటు ఇచ్చేవారు. ఇంత క్వాలిటీ ఇస్తూ కూడా సంవత్సరమంతా మిగిలిన డబ్బుతో జూన్లో పిల్లలకు పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు కొని పంపిణి చేసేవారు.. 
మిగతాబడులలో మధ్యాహ్న భోజనం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చెబితే పై మెనూ విలువ అర్థం అవుతుంది. పది శాతం బడులలో తప్ప మధ్యాహ్న భోజనం చండాలంగా ఉంటుంది. నీళ్ళ పప్పు / సాంబారు అది కూడా కడుపు నిండా పెట్టకపోవడం... ఇలాంటి అరాచకాలు చాలా ఉన్నాయి. 
కేన్సర్ బాధిస్తున్నా ఆమె చాలా సంవత్సరాల పాటు ఉత్సాహంగా పిల్లలకు భోజనం వండించారు.
వారు  చనిపోవడానికి 10 రోజుల ముందు  బెంగళూరు ఆస్పత్రిలో చూడడానికి వెళ్ళాం.  ఎంతో ఉత్సాహంగా అసలు తనకు ఎలాంటి జబ్బు లేనట్టు మాట్లాడారు. ఆమెకు కేన్సర్ అంటే నమ్మబుద్ధి కాలేదు కూడా...
పేద పిల్లలకు కడుపార అన్నం పెట్టించిన ఆ తల్లి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాము. )

వారు ఈ లోకాన్ని వీడి నేటికి ఒక యేడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా వారి భర్త నారాయణ రెడ్డి గారు జీవని పిల్లలకు ఒక జత బట్టలు ఇస్తూ స్పెషల్ మీల్ స్పాన్సర్ చేసారు. శైలజ గారి ఆత్మశాంతి కోరుకుంటూ

జీవని పిల్లలు

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers