మిత్రులారా జీవనికి బ్లాగర్లతో ఉన్న అనుబంధం గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాగర్ల బృందం వచ్చిందంటే పిల్లలకు పండగే. జీవని స్థాపించిన 4 సంవత్సరాలలో ఎంతోమంది పిల్లల్ని పలకరించడానికి వచ్చారు. కానీ పిల్లలు ఎక్కువ సంతోషం ఫీల్ అయ్యేది మాత్రం బ్లాగర్ల సమక్షంలోనే. కార్తీక్, రాజ్ కుమార్, భాస్కర్, బంతి, రెహమాన్, నాగార్జున రేపు ఇక్కడకు వస్తున్నారు. తిరిగి ఆదివారం వెళ్తారు. మీరూ జీవనికి రావాలి అనుకుంటే ఇదే మా ఆహ్వానం. వసతి తిండి విషయంలో మేము ఇబ్బంది పడతాము అని భావించకండి. మాకు ఎలాంటి సమస్యా లేదు. రావాలనుకుంటే దయచేసి సంప్రదించండి.
jeevani.sv@gmail.com
9440547123...
Read More
మిత్రులారా www.jeevanianantapur.org పేరుతో గతంలో జీవని వెబ్సైట్ ను లాంచ్ చేసాం. అయితే అది బేసిక్ వర్షన్ లో ఉండటం, తర్వాత నిర్వహణ లేక క్రాష్ కావడం జరిగింది. అందువల్ల అదే పేరుతో తిరిగి వెబ్సైట్ ను రూపొందించాము. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందుకోసం ఎంతో శ్రమ తీసుకున్న మిడుతూరు సురేష్ రెడ్డికి ధన్యవాదాలు తెల్పుతున్నాము .
DONATIONS FOR JEEVANI VIDYALAYAM
TOTAL ESTIMATION : 5,00,000/-
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY - 10,000/-
SHILPA TOWNSHIP ...

అనంతపురానికి చెందిన ప్రముఖ చిట్ ఫండ్ సంస్థ శ్రీ శక్తి స్వరూప్ చిట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వెంకటరామి రెడ్డి గారు జీవని విద్యాలయానికి 1 లక్ష విరాళం అందజేసారు. వారి కుమార్తె శ్రీమతి ప్రతిభ w/o అనిల్ కుమార్ రెడ్డి, కోడలు శ్రీమతి లలితమ్మ w/o అమరనాథ్ రెడ్డి గార్ల విరాళాన్ని ఆయన అందజేసారు. వీరికి జీవని గురించి పరిచయం చేసిన నార్పల సప్తగిరి రెడ్డి, CEO, SAI DATTAA MAAC SOCIETY, ANANTAPUR మరియు కుమార స్వామి రెడ్డి, Asst REGISTRAR,...
కొన్ని కలలు నిజాలు అనే భ్రమను కలిగిస్తాయి...
కొన్ని నిజాలైతే ఎప్పటికీ కలైతేనే బాగుండుననిపిస్తాయి..
ఇప్పటికీ మనసు పదే పదే చెబుతుంది,నీ నిష్క్రమణం నిఖార్సైన కల అని !
కాదని వాదించే గట్టి గుండెలు కావు మావి. కరిగిపోయే కాలాన్ని చూస్తూ..నీ పరిచయం పంచిన పరిమళాల్ని నెమరువేస్తూ.. రోజుకొక ముసుగుతో కొత్త పుటల్ని తిప్పుతూనే ఉంటాం.ప్రతి పుటలో నీ పేరు ఉండకపొవచ్చు గాక!కానీ మా జీవితాల్లోని మొదటి పేజిలో ఎన్నటికీ చెరగని సంతకం మాత్రం నీదే.నీ జ్ఞాపకాల్ని మొగలి రేకుల్లో మోసుకొచ్చేది...
మిత్రులారా జీవని విద్యాలయం కేవలం జీవని పిల్లలకేనా అని ఒక మిత్రుడు అడిగారు. సరే అందరికీ తెలుస్తుంది కదా అని టపా పెడుతున్నాము. ప్రతి తరగతికి 25 మంది పిల్లలు ఉంటారు. ( అప్పుడు తరగతి గది వాతావరణం ఉంటుంది ) ఎల్.కె.జి. నుంచి 2 వ తరగతి వరకు అంటే 4 క్లాసులు మొత్తం 100 మంది పిల్లలుఇందులో జీవని పిల్లలు, ఇప్పుడున్న వారు మరియు కొత్తగా తీసుకునేవారు కలిపితే 25 మంది అవుతారుమిగతా 75 మంది బయటి వారు ఉంటారు.ఫీజులు స్కూలు నడపడానికి సరిపోయేంత మాత్రమే ఉంటాయి. లాభాపేక్ష లేకుండా స్కూల్ నడుస్తుంది. టీచర్ల విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు. మంచి...
మిత్రులారా జీవని విద్యాలయం నిర్మాణం ప్రారంభం అయింది. మే 1 నాటికి పూర్తి అవుతుందని భావిస్తున్నాము. జీవని విద్యాలయంలో చదువు కృత్యాలు, ఆటల ద్వారా జరుగుతుంది. పిల్లలు స్వీయ అనుభవం ద్వారా అంటే ఒక వస్తువు గురించి చెప్పడం కంటే దాన్ని పిల్లలు స్వయంగా తాకి చూస్తే జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు. తర్వాత చూడటం, వినడం, చదవడం. ఇందులో భాగంగా పిల్లలకు కొత్తగా నేర్పే ప్రతి పదం వారు స్వీయ అనుభవం ద్వారా తెలుసుకోవాలి, లేదంటే చూపించాలి. ఇందుకోసం కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలని అనుకున్నాము. మీకు అవకాశం ఉంటే కంప్యూటర్లు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము....