కొన్ని కలలు  నిజాలు అనే భ్రమను కలిగిస్తాయి... 
కొన్ని నిజాలైతే ఎప్పటికీ కలైతేనే బాగుండుననిపిస్తాయి..   
ఇప్పటికీ మనసు పదే పదే చెబుతుంది,
నీ నిష్క్రమణం నిఖార్సైన కల అని !
కాదని వాదించే గట్టి గుండెలు కావు మావి. 

కరిగిపోయే  కాలాన్ని  చూస్తూ..
నీ పరిచయం పంచిన పరిమళాల్ని నెమరువేస్తూ.. 
రోజుకొక ముసుగుతో  కొత్త పుటల్ని తిప్పుతూనే ఉంటాం.
ప్రతి పుటలో నీ పేరు ఉండకపొవచ్చు గాక!
కానీ మా జీవితాల్లోని మొదటి పేజిలో ఎన్నటికీ  చెరగని సంతకం మాత్రం నీదే.
నీ జ్ఞాపకాల్ని మొగలి రేకుల్లో మోసుకొచ్చేది నీ పేరో, ఊరో కాదు..  మా చిరునవ్వులే. 
ఎందుకంటే.. నీ సాన్నిధ్యం లో మేం చేసిందల్లా తనివితీరా  నవ్వడమే.


-- "మనసు పలికే" అపర్ణ ఈ లోకాన్ని వదలి వెళ్ళిన శంకర్.ఎస్ గారి ఙ్ఞాపకాలు ఎప్పటికీ తడి ఆరవేమో...
నేడు వారి జయంతి సందర్భంగా వారి మిత్ర బృందం జీవనికి 5000/- విరాళం అందించారు.
పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము  

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు శంకర్ గారూ..

     
  2. Anonymous Says:
  3. పుట్టినరోజు శుభాకాంక్షలు శంకర్ గారూ

     

Blog Archive

Followers