సీమసింహం కార్తీక్ అలియాస్ పయ్యావుల కార్తికేయరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రబృందం జీవనికి 5000/- విరాళం అందించారు. పిల్లల తరఫున కార్తీక్ కు శుభాకాంక్షలు మరియు మిత్రులకు ధన్యవాదాలు.
కార్తీక్ గారి బ్లాగ్ http://nenu-naa-svagatam.blogspot.in/
...
జారుడుబండ, ఉయ్యాల, తూగుడుబల్ల చూస్తే పిల్లలేంటి పెద్దలకూ సంబరం అవుతుంది. వీటిని పిల్లలు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసి చాలా రోజులు అవుతోంది. అయితే సమయం కుదరక టపా పెట్టలేకపోయాము. వీటికి 40,000/- ఖర్చు అయింది. ఎప్పటినుంచో బ్లాగుల్లో ఉన్న ఒకాయన దీన్ని స్పాన్సర్ చేసారు. తమ పేరు వెల్లడించవద్దని చెప్పడంతో వారి వివరాలు ఇవ్వడం లేదు. వారికి వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లల కేరింతల్ని వారికి వినమ్రంగా...
జీవనిలో పచ్చదనం లేదు, అదొక్కటి మిస్ అయిందని చాలామంది అన్నారు. అయితే కొన్ని ఇబ్బందుల వల్ల మొక్కలు నాటడం ఆలస్యం అయింది. నిన్న దాదాపు 150 మొక్కలు నాటాము. వీటిలో ప్రధానంగా కొబ్బరి, అల్ల నేరేడు, జామ, సపోటా, మామిడి ఇంకా గుబురుగా పెరిగేవి, అందంగా కనిపించేవి, పూల మొక్కలు లాంటివి ఉన్నాయి. సాయంత్రం తేలికపాటి వర్షం వచ్చి మొక్కల్ని తడిపి వెళ్ళింది.
DONATIONS FOR JEEVANI VIDYALAYAM
TOTAL ESTIMATION : 5,00,000/-
SANTHI,...
రేపు పిల్లలు తమ అవ్వాతాతలు ఇతర బంధువుల ఊర్లకు వెళ్తున్నారు. తిరిగి 31వ తేదీన వస్తారు. ఏడాదిలో ఎక్కువకాలం పిల్లల్ని మన దగ్గరే ఉంచుకుంటున్న విషయం మీకు తెలిసిందే. ఈ పదిరోజులు ఇక్కడ మా కుటుంబం ఒంటరిగా గడపాల్సివస్తుంది. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించే 31వ తేదీ కోసం ఈ రోజు నుంచే వేచి చూస్తున్నాం....
మిత్రులారా ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా జీవనిలోకి కొత్త పిల్లల్ని ఆహ్వానిస్తున్నాము. తల్లిదండ్రులు ఇద్దరూ లేని, 7 సంవత్సరాల లోపు పిల్లలు మీకు తెలిసి ఎవరైనా ఉంటే దయచేసి తెల్పండి. కుల మత ప్రాంతీయత లింగ వివక్షలు లేవు. పిల్లలు తమ జీవితంలో స్థిరపడేవరకు జీవని బాధ్యత వహిస్తుందని మరోసారి మీకు తెలియజేస్తూ...జీవని...
నిన్నటి పోస్టుకు వెంటనే స్పందించిన వాణీనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన రెండు కంప్యూటర్లు విరాళంగా ఇచ్చారు. వాణీనాథ్ రెడ్డి గారు రేనాటి గ్రూప్ సంస్థలకు సి.ఇ.ఒ. ఆయన వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నా జీవనికి మొదటి స్థానం ఇస్తారు. ముందునుంచీ ఆయన జీవనికి సహాయపడుతూ ఉన్నారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇక ఒక్క కంప్యూటర్ మాత్రం కావలసిఉంది.
...
వేసవిలో పిల్లలకు ఆటవిడుపు కోసం, జూన్లో ప్రారంభించనున్న జీవని విద్యాలయానికి ప్రొమోషన్ కోసం సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి బయటి పిల్లల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బయటి పిల్లలు 75 మంది జీవని పిల్లలు 39 మంది పాల్గొన్నారు. 15 రోజుల పాటు హ్యాండ్ రైటింగ్, క్రాఫ్ట్, నైతిక విలువలు, యోగా, ధ్యానం, తెలుగు గేయాలు, డ్రాయింగ్ తదితర అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాము.
చివరి రోజు పిల్లలకు ఆటల పోటీలు పెట్టాము. సాధారణంగా అందరికీ...
మిత్రులారా జూన్లో ప్రారంభం కానున్న జీవని విద్యాలయానికి రెండు కంప్యూటర్లను విరాళంగా ఇచ్చారు. COREEL TECHNOLOGIES, BANGALORE లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సోదరుడు హర్షవర్ధన రెడ్డి వీటిని కంపెనీ ద్వారా జీవనికి ఇప్పించారు. హర్షకు మరియు కంపెనీ వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కంప్యూటర్లు ప్రస్తుతానికి బెంగళూరులోనే ఉన్నాయి. జూన్ 1 కి జీవనికి చేర్చనున్నాము. మరికొంత మంది మిత్రులు కంప్యూటర్లు ఇప్పిస్తామని మెయిల్ చేసారు. వారికి కూడా మా విన్నపం ఏమంటే జూన్ 1కి ఇప్పించగలిగితే చాలా సంతోషం. ఇక 3 / 4 కంప్యూటర్లు...
సిడ్నీలో ఉంటున్న ఆదిత్య కుమార్, వారి శ్రీమతి వారుణి ఈ రోజు జీవనికి వచ్చారు. పిల్లలతో కాసేపు గడిపారు. జీవని నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. పదివేలు విరాళం అందజేశారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DONATIONS FOR JEEVANI VIDYALAYAM
TOTAL ESTIMATION : 5,00,000/-
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY - 10,000/-
SHILPA TOWNSHIP - 20,000/-
VENKATARAMI REDDY ...
DONATIONS FOR JEEVANI VIDYALAYAM
TOTAL ESTIMATION : 5,00,000/-
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY - 10,000/-
SHILPA TOWNSHIP - 20,000/-
VENKATARAMI REDDY - 1,00,000/-
ANANTHAIAH ...
జీవనిలో సమ్మర్ క్యాంపు ఉత్సాహంగా సాగుతోంది. నిన్న ఈ రోజు పిల్లలతో క్రాఫ్ట్ పనులు చేయించాము. రిసోర్స్ టీచర్లుగా గాయత్రి, శ్రావణి వచ్చారు. వీరు అనంతపురంలోని AFFLATUS GLOBAL SCHOOL ( AGS ) లో పని చేస్తున్నారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అలాగే AGS ప్రిన్సిపాల్ SALOMAN RAJU గారికి కూడా ధన్యవాదాలు.
...
బృందావనం సభ్యుల సహాయ సహకారాలతో జీవనిలో ప్రాజెక్టు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పిల్లల ఆరోగ్యం కోసం రాగిబిందెలో నిలువ ఉంచిన నీళ్ళు ఇస్తున్నాము. రాగిబిందె నీళ్ళ విశిష్టతను బృందావనం సభ్యురాలు కల్లూరి శైలబాల గారు తమ బ్లాగులో వివరించారు.
http://kallurisailabala.blogspot.in/search/label/%E0%B0%86%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82
...
అనంతపురానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనంతయ్య గారు జీవనికి 50,000/- విరాళం అందించారు. వీరు సిఫ్లాన్ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్. పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆయన వెన్నుదన్నుగా ఉన్నారు. అనంతయ్య గారు జీవని విచ్చేసి మన కార్యక్రమాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేసారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
...
https://www.youtube.com/watch?v=t8r4-TxB41w
http://www.jeevanianantapur.com
DONATIONS FOR JEEVANI VIDYALAYAM
TOTAL ESTIMATION : 5,00,000/-
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY - 10,000/-
SHILPA TOWNSHIP - 20,000/-
VENKATARAMI REDDY - 1,00,000/-
ANANTHAIAH ...