వేసవిలో పిల్లలకు ఆటవిడుపు కోసం, జూన్లో ప్రారంభించనున్న జీవని విద్యాలయానికి ప్రొమోషన్ కోసం సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి బయటి పిల్లల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బయటి పిల్లలు 75 మంది జీవని పిల్లలు 39 మంది పాల్గొన్నారు. 15 రోజుల పాటు హ్యాండ్ రైటింగ్, క్రాఫ్ట్, నైతిక విలువలు, యోగా, ధ్యానం, తెలుగు గేయాలు, డ్రాయింగ్ తదితర అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాము. 


చివరి రోజు పిల్లలకు ఆటల పోటీలు పెట్టాము. సాధారణంగా అందరికీ బహుమతులు ఇవ్వడం బావుంటుంది అనిపిస్తుంది. ఆటల్లో గెల్చినవారికి, ఓడినవారికి ప్రైజ్ ఇచ్చాము. ఆటల్లో పాల్గొనకపోయినా చూసినందుకు గానూ ఉత్తమ ప్రేక్షకులుగా మిగిలినవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది :) పిల్లలందరూ చాలా సంతోషించారు.


సమ్మర్ క్యాంప్ విజయవంతం కావడానికి కృషి చేసినవారు 
శ్రీవాణి, శ్వేత, స్రవంతి, శ్రీవిద్య - జీవని విద్యాలయం టీచర్లు
కుమార్, రాజు - జీవని స్టాఫ్
రిసోర్స్ పర్సన్లుగా వచ్చినవారు: మేడా ప్రసాద్ ( https://www.facebook.com/prasad.meda.5?fref=ts  ), గోవర్ధన్, గాంగేనాయక్, రవి, విజయ, సరోజ, తిప్పయ్య - వీరంతా ప్రభుత్వ ఉపాధ్యాయులు
గాయత్రి, శ్రావణి - Mentors, Afflatus Global School, atp
లీలావతి - కుక్
ఇద్దరు లక్ష్మిదేవులు - ఆయాలు 

వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers