
చిరకాల మిత్రులు, ఉత్తమ సినీవిమర్శకులుగా 2010లో నంది అవార్డు అందుకున్న వట్టికూటి చక్రవర్తి గారు జీవనికి 5000/- విరాళం అందించారు. చక్రి మొదట ఈనాడు ఆదివారంలో సహాయ సంపాదకులుగా ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఈనాడు సినిమాకు పనిచేసారు. అప్పుడే ఆయన అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఈనాడు దినపత్రికలో జనరల్ బ్యూరోలో కొన్ని విభాగాలకు ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
...