గత సంవత్సరం రోటరీపురంలో జీవని ఆశ్రమం మొదలు కాగానే కొన్ని పుస్తకాలు కొన్నాము. మిత్రులు భైరవభట్ల కామేశ్వర రావు, సుధాకర్ సిల్వేరు, పద్మజా రవి గార్లు చందమామ, టింకిల్, కొత్తపల్లి పుస్తకాలకు చందా కట్టారు.
ఇక బ్లాగర్ రెహ్మాన్ అయితే అనంతపురం వస్తే మెల్లగా తన సంచిలోంచి మంచి మంచి పుస్తకాలు తీస్తారు. 

ఇలా ఉంటే బ్లాగర్ శేఖర్ మన గ్రంథాలయాన్ని ఇంకా బాగా తీర్చిదిద్దుదాం అని గతంలో వచ్చినపుడు చెప్పారు. తర్వాత ఒక బీరువా కొని బోల్డన్ని పుస్తకాలు పంపారు. పీకాక్ క్లాసిక్స్ మొత్తం సెట్ వచ్చింది. ప్రజాశక్తి పుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ బాధ్యతను నెత్తిన వేసుకుంది మళ్ళీ రెహమానే.

ఇక శేఖర్ గారు తమ మిత్రులందరినీ మోటివేట్ చేసి 15,000/- వరకూ ఇందుకు వెచ్చించారు. గ్రంథాలయం ప్రారంభించినట్టు ఒక చిన్న ప్రొగ్రాంలాగా చేస్తే పిల్లలకు స్ఫూర్తిగా ఉంటుందని శేఖర్ అన్నారు. ఇందుకోసం అనంతపురంలో ఉంటున్న విపస్యన గురూజీ సింగ్ గారిని, మల్లిఖార్జున రెడ్డిని గారిని మాట్లాడి పంపారు. సింగ్ గారి గురించి మరోసారి విపులంగా తెలియజేస్తాము. ఆయన చాలా చక్కగా పిల్లలకు పుస్తక పఠనం గురించి చెప్పారు.
 

మా లైబ్రేరియన్ పేరు శివ. మంచి డ్యాన్సర్గా, మిమిక్రీ ఆర్టిస్టుగా పేరుపొందిన శివ పుస్తకాలు కూడా చాలా నీటుగా సర్ది బాధ్యతగా ఉంటాడు.
On behalf of children our sincere thanks to all the below donors for their kind contribution for a good job

Rajeswari. ML
Shylajesha. S
Sekhar . G ( Chandu )
Anikethan
Asha 
Aswini
Ashwini . MC
Deepa Nanda
Hemanth
Keerthi
Keshav
Lakshmi
Manjula.M
Nalini
Namratha
Nandini
Navya
Navya.VN
Pallavi
Paniraj
Pooja
Pragya
Prasad Jain
Raman
Sahana
Sangeetha
Shankar
Shaarika
Shilpa
Shiva leela
Swetha
Sindhu
Sinchana
Smitha
Soumya
Spoorthi
Sreyas
Sridhar
Sunil
Surekha
Venkat Prasad











            

      







 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo