జీవని విద్యాలయంలో పనిచేయనున్న ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నాము. అనంతపురంలోని అఫ్లేటస్ గ్లోబల్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి రోజు కార్యక్రమానికి ప్రొఫెసర్ హరినాథ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన కెమిస్ట్రీలో దిగ్గజంలాంటి వారు. AGS కరస్పాండెంట్ సాల్మన్ రాజు మరియు మా అందరికీ ఆయన ఇంటర్మీడియెట్లో  నెల్లూరు రత్నంలో కెమిస్ట్రీ బోధించారు. పిల్లల్ని ప్రశాంత వాతావరణంలో టెన్షన్ లేకుండా చదివేలా చూడాలని, పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లుగా కంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దమని ఆయన సూచనలు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోవర్ధన్ గారు శిక్షణ ఇచ్చారు. 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers