ఉపాధ్యాయుల శిక్షణ ఈరోజు కూడా దిగ్విజయంగా జరిగింది. మొదట మూడురోజులు అనుకున్నప్పటికీ సమయాభావం వల్ల రెండురోజులకు కుదించి నేటితో ముగించాము. తెలుగు అభినయగేయాలు, మిగతా సబ్జెక్టుల్లో బోధన తదితర అంశాలపై గోవర్ధన్, మేడా ప్రసాద్ శిక్షణను ఇచ్చారు.  వీరు పాఠశాల విద్యలో విశేషమైన కృషి చేస్తున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రసాద్ క్లాస్ రూం ఒక అద్భుత సృష్టి మీరు కూడా ఒక్కసారి ఆయన విద్యా విధానాన్ని ఇక్కడ చూడవచ్చు  http://myschooltrends.blogspot.in/


తాము ఎన్నో విషయాలు తెలుసుకున్నామని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేసారు.  పిల్లలకు దగ్గర కావడానికి అభినయగేయాలు చాలా ఉపయోగపడతాయని గోవర్ధన్, ప్రసాద్ చెప్పారు. క్లాస్ రూంలోకి వెళ్ళాక ఎలాంటి సిగ్గు, బిడియం లేకుండా పిల్లలతో కలసిమెలసి ఆడుతూపాడుతూ చదువు చెప్పాలని సూచించారు. టీచర్లతో వారు ఆడించారు, పాడించారు.
https://www.youtube.com/watch?v=5qcNKijYVSU&feature=youtu.be

https://www.youtube.com/watch?v=6Sf99Etc0mM&feature=youtu.be

https://www.youtube.com/watch?v=Q6f-IrCP_wo&feature=youtu.be
on
categories: | edit post

1 Responses to పిల్లల్లా గెంతిన టీచర్లు

  1. Anonymous Says:
  2. For English interactive rhymes Cullen is famous for that. I guess you are aware this. But I am presenting here

    Ex: http://www.youtube.com/watch?v=D3ny3jru-mk

     

Blog Archive

Followers