అనంతపురం - తాడిపత్రి రహదారి నిర్మాణంలో ఉన్నందువల్ల బ్రాడ్ బ్యాండ్ వారం రోజులుగా లేదు. ఫోన్ తో నెట్టుకొస్తున్నాము. నెట్ రావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. జీవని కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు
జీవనికి 20 కిలోమీటర్ల దూరంలో కొట్టలపల్లె అనే గ్రామం ఉంది. చంద్రమౌళీశ్వర రెడ్డి అనే ఆయన కొద్ది రోజుల కిందట వచ్చి 19న మా బాబు బర్త్ డే ఉంది. పిల్లలకు ఏమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగారు. మేము బియ్యం తీసుకురండి అని చెప్పాము. పిల్లలకు స్వీటు చేయించండి అని అడిగారు ఆయన.
నిన్న ఆయనతోపాటు మరో ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు. మాకు అర్థంకాక బాబు ఎక్కడ అని అడిగాము. తమ కుమారుడు ఈశ్వర రెడ్డి లుకేమియాతో ఆగస్టులో చనిపోయాడని చెప్పారు. ఆ అబ్బాయికి 14 సంవత్సరాల వయసు. 10 లక్షల రూపాయలు ఖర్చుపెట్టాము అయినా మాకు దక్కలేదని తండ్రి చెప్పారు. మాకు చాలా బాధ అనిపించింది.
ఇంకో విషయం ఆయనలో నన్ను అబ్బురపరిచింది. ఆయన కిరాణా వ్యాపారి ప్రతి సంవత్సరం 40 వేల రూపాయలు గుళ్ళకు విరాళంగా ఇస్తుంటారట. అలాగే పిల్లల బర్త్ డేలు అనాధ, వృద్ధాశ్రమాల్లో చేస్తారట. ప్రస్తుత పరిస్థితిలో సాధారణంగా ఎవరికైనా ఒక విరక్తి కలుగుతుంది. ఇంత చేస్తున్నా ఎందుకు నాకే ఇంత అన్యాయం జరిగింది అనే ఒక భావన కలుగుతుంది. కానీ ఆయన అన్నారు. ఇక నుంచీ సగం డబ్బు ( 40 వేలలో ) ఇలాంటి తల్లిదండ్రీ లేని పిల్లలకు ఖర్చుపెడతాను అని.
జీవితంలో అంత పెద్ద కొడుకును పోగొట్టుకోవడం కన్నా బాధాకరం ఏముంటుంది?
అయినప్పటికీ ఆయన తాను నమ్మిన దేవుడి మీద విశ్వాసం కోల్పోలేదు. మరోవైపు మానవత్వాన్ని ఇనుమడింపచేసుకున్నారు. ఆయన మనోనిబ్బరానికి మనసులోనే హ్యాట్సాఫ్ చెప్పుకున్నాను.
జీవనిలో స్పాన్సర్ వివరాలకు కింది లింక్ నొక్కండి
http://jeevani2009.blogspot.in/2013/09/blog-post.html
జీవని రోజువారీ అందుకున్న విరాళం మరియు వ్యయం గురించి తెలుసుకోడానికి కింది లింక్ నొక్కండి http://www.jeevanianantapur.com/dailybalance.php
శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ సెకెండ్ ఇయర్ విద్యార్థులు జీవనిలో చేసిన హడావిడి మీరే చూడండి.
SRIT, Chief Executive Officer కర్ణా జగన్మోహన్ రెడ్డి, కంప్యూటర్ సైన్స్ HOD హితేంద్ర శర్మ, ప్రొఫెసర్ రంజిత్ రెడ్డి
ఇక పిల్లలు వడ్డిస్తున్న ఫోటో అపురూపమైనది. ఎందుకంటే వారికి ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి :)
SRIT విద్యార్థులకు జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
Take up one idea. Make that one idea your life - think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success.
- Swami Vivekananda
మిత్రులారా ఈ శుభవార్తను మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల అనంతపురం జిల్లాలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. 100% అంటే మొత్తం 420 సీట్లు ఫిలప్ అయ్యాయి. దీని వెనుక కఠోరశ్రమ, కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డిగారి కృషి ఎంతో ఉంది. అలాగే కర్ణా జగన్మోహన్ రెడ్డి, CEO గారు మొదలుకుని స్టాఫ్ మొత్తం ఈ విజయం వెనుక వున్నారు. వీరందరికీ జీవని తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. వచ్చే సంవత్సరం రాయలసీమలోనే SRIT నెంబర్ వన్ కాలేజి కావాలని కోరుకుంటున్నాము.ఇంజనీరింగ్ కాలేజీల్లో కుప్పలుతెప్పలుగా సీట్లు మిగిలిపోతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇతర కాలేజీల్లో వందలాది సీట్లు మిగిలిపోయాయి.
జీవనికి SRITకి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసే వుంటుంది. తెలియని వారి కోసం మరోసారి.
SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి జీవనికి ప్రధాన కార్యదర్శి కూడా. తాను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 50 లక్షల రూపాయలతో జీవని హోం నిర్మించారు. SRITలో స్వీపర్ దగ్గర్నుంచి కరస్పాండెంట్ వరకూ ప్రతి నెలా జీవనికి విరాళం ఇస్తారు. వారి నుంచి 13 - 15 వేలు అందుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు కూడా మనకు సహాయపడుతుంటారు. ఇలా జీవని SRIT బంధం విస్తరిస్తూ వస్తోంది.
Once again all the best to SRIT
శ్రీ గంగిరెడ్డి మరియు శ్రీమతి శ్రీదేవి, నవ్య గార్ల పేరిట బి.హర్షా రెడ్డి ఈ రోజు స్పెషల్ మీల్ స్పాన్సర్ చేసారు. హర్ష గారు పట్టుచీరలకు పేరుపొందిన ధర్మవరానికి చెందినవారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
బాల్య స్నేహితుడు, అనంతపురంలోని AFFLAUS GLOBAL SCHOOL ప్రిన్సిపాల్ సాల్మన్ రాజు గారి కుమార్తె షిర్లీ పుట్టినరోజు నేడు . సాల్మన్ సతీమణి సలోమి వారి కుమారుడు కెన్నీ, జీవని పిల్లలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండగా షిర్లీ కేక్ కట్ చేసింది. షిర్లీకి ఆయురారోగ్యాలు కలగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము.

రాగిముద్ద రుచి రాయలసీమ వాసులకు బాగా తెలుసు. ఇది ఎంతో బలవర్ధకం కూడా. డయాబెటిక్స్ మా ప్రాంతంలో ఎక్కువగా ముద్ద తింటారు. జీవని మెనూలో రాగిముద్ద వారానికి రెండుసార్లు ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రేష్టమైన రాగులను పొలంలోనే కొని వాటిని శుభ్రపరచి జీవనికి పంపుతారు. బెంగళూరు నుంచి శ్రమపడి మాకు చేరుస్తారు. వారు శ్రీ బాలు మరియు శ్రీమతి సుమతి దంపతులు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
జీవనిలో స్పాన్సర్ వివరాలకు కింది లింక్ నొక్కండి
http://jeevani2009.blogspot.in/2013/09/blog-post.html
జీవని రోజువారీ అందుకున్న విరాళం మరియు వ్యయం గురించి తెలుసుకోడానికి కింది లింక్ నొక్కండి
http://www.jeevanianantapur.com/dailybalance.php
అమెరికాలో ఉంటున్న ప్రవీణగారు జీవనికి 5000/- విరాళం అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందుకు సహకరించిన వారి సోదరులు జగదీశ్వర్ గారికి కూడా ధన్యవాదాలు. ప్రవీణ వాళ్ళ అమ్మగారు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని మేమందరం ప్రార్థిస్తున్నాము.
జీవనిలో స్పాన్సర్ వివరాలకు కింది లింక్ నొక్కండి
http://jeevani2009.blogspot.in/2013/09/blog-post.html
జీవని రోజువారీ అందుకున్న విరాళం మరియు వ్యయం గురించి తెలుసుకోడానికి కింది లింక్ నొక్కండి
http://www.jeevanianantapur.com/dailybalance.php
మిత్రులారా జీవనిలో వివిధ రకాల స్పాన్సర్ కు అయ్యే ఖర్చు కింద తెలియపరుస్తున్నాము.
స్పెషల్ మీల్స్: బెల్లం పాయసం / కేసరీ బాత్, కలర్ రైస్, కుర్మా, అన్నం, పప్పు, రసం, పెరుగు పండు : 2000/-
స్వీటు హోలిగ పెట్టాలి అనుకుంటే: 1000/- అదనం
పుట్టినరోజు కేక్: 2 కిలోలు - 440/-
ఒకరోజు మొత్తం సాధారణ భోజనం: 2000/-
పాలు నెలకు: 4500 - 5000/-
గుడ్లు : వారానికి ఒకసారి - 200/-
అరటిపండు : వారానికి రెండుసార్లు - 100 - 150/- ( ఒకసారికి )
ఒక అబ్బాయి / అమ్మాయికి ఖర్చు : సంవత్సరానికి 20,000/-
ఇందులో హాస్టల్ ఖర్చు 12,000/- మిగతా 8000/- స్కూల్ ఫీజు, వైద్య అవసరాలు ఇతరత్రా...
ధన్యవాదాలు
హైదరాబాద్లో ఉంటున్న స్రవంతి గారి జన్మదినం నిన్న. వారు ఈ సందర్భంగా జీవనికి 10,592/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు
గుంటూరుకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి రత్నకుమారి గారు జీవనికి విరాళం అందించారు. వీరికి జీవనిని పరిచయం చేసింది నిర్మలాదేవి గారు ( జీవని ముఖ్య కార్యకర్తల్లో ఒకరు ) వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET
http://www.jeevanianantapur.com/dailybalance.php?year=2013&month=9&submit=Submit#
DAILY BALANCE SHEET
http://www.jeevanianantapur.com/dailybalance.php?year=2013&month=9&submit=Submit#
శాండియాగోలో ఉంటున్న ఎర్రిస్వామి, శ్రీమతి శైలజ గార్ల కుమారుడు కోవిద్ జన్మదినం నేడు. వెకేషన్ మీద స్వస్థలం ఉరవకొండకు వచ్చిన వీరు జీవనికి విచ్చేసారు. ఇక్కడే కోవిద్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా 5000/- విరాళం అందించారు. వీరికి జీవనిని పరిచయం చేసింది సోదరులు రమణ,రఘు గార్లు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
http://www.jeevanianantapur.com/dailybalance.php
http://www.jeevanianantapur.com/dailybalance.php