జీవనికి 20 కిలోమీటర్ల దూరంలో కొట్టలపల్లె అనే గ్రామం ఉంది. చంద్రమౌళీశ్వర రెడ్డి అనే ఆయన కొద్ది రోజుల కిందట వచ్చి 19న మా బాబు బర్త్ డే ఉంది. పిల్లలకు ఏమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగారు. మేము బియ్యం తీసుకురండి అని చెప్పాము. పిల్లలకు స్వీటు చేయించండి అని అడిగారు ఆయన.
నిన్న ఆయనతోపాటు మరో ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు. మాకు అర్థంకాక బాబు ఎక్కడ అని అడిగాము. తమ కుమారుడు ఈశ్వర రెడ్డి లుకేమియాతో ఆగస్టులో చనిపోయాడని చెప్పారు. ఆ అబ్బాయికి 14 సంవత్సరాల వయసు. 10 లక్షల రూపాయలు ఖర్చుపెట్టాము అయినా మాకు దక్కలేదని తండ్రి చెప్పారు. మాకు చాలా బాధ అనిపించింది.
ఇంకో విషయం ఆయనలో నన్ను అబ్బురపరిచింది. ఆయన కిరాణా వ్యాపారి ప్రతి సంవత్సరం 40 వేల రూపాయలు గుళ్ళకు విరాళంగా ఇస్తుంటారట. అలాగే పిల్లల బర్త్ డేలు అనాధ, వృద్ధాశ్రమాల్లో చేస్తారట. ప్రస్తుత పరిస్థితిలో సాధారణంగా ఎవరికైనా ఒక విరక్తి కలుగుతుంది. ఇంత చేస్తున్నా ఎందుకు నాకే ఇంత అన్యాయం జరిగింది అనే ఒక భావన కలుగుతుంది. కానీ ఆయన అన్నారు. ఇక నుంచీ సగం డబ్బు ( 40 వేలలో ) ఇలాంటి తల్లిదండ్రీ లేని పిల్లలకు ఖర్చుపెడతాను అని.
జీవితంలో అంత పెద్ద కొడుకును పోగొట్టుకోవడం కన్నా బాధాకరం ఏముంటుంది?
అయినప్పటికీ ఆయన తాను నమ్మిన దేవుడి మీద విశ్వాసం కోల్పోలేదు. మరోవైపు మానవత్వాన్ని ఇనుమడింపచేసుకున్నారు. ఆయన మనోనిబ్బరానికి మనసులోనే హ్యాట్సాఫ్ చెప్పుకున్నాను.జీవనిలో స్పాన్సర్ వివరాలకు కింది లింక్ నొక్కండి 
 http://jeevani2009.blogspot.in/2013/09/blog-post.html
 
జీవని రోజువారీ అందుకున్న  విరాళం మరియు వ్యయం గురించి తెలుసుకోడానికి కింది లింక్ నొక్కండి  http://www.jeevanianantapur.com/dailybalance.php

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers