మిత్రులారా జీవనిలో LKG నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మొదటి అంతస్థులో బాలబాలికలు పక్కపక్కన డార్మిటరీల్లో ఉంటున్నారు. పిల్లలు అందరూ సోదరభావంతో మెలగుతూ ఉంటారు. అయితె పెరుగుతున్న వారి వయసును దృష్టిలో పెట్టుకుని బాలికలకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డార్మిటరీని నిర్మించాలని అనుకుంటున్నాము. వచ్చే జూన్ కల్లా దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాము. ఇలా ఆలొచిస్తున్నప్పుడే జీవని మంత్లీ డోనర్ వినీల్ గారు ఫోన్ చేసి తమ మిత్రులు ( అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ వారు మరియు వారి మిత్ర బృందం ) జీవనికి 75,000/- విరాళం ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పారు.


ఇక్కడ ఒక విషయం గుర్తుకు వస్తోంది...అనంతపురం సేవా రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న Rural Development Trust ( RDT ) కి చీఫ్ MONCHO FERRER. వాళ్ల నాన్నగారు Late. VICENT FERRER. వారే వ్యవస్థాపకులు. అనంతపురానికి దగ్గర్లో ఒక ఆస్పత్రి నెలకొల్పాలని అనుకున్నారట. అయితే అందుకు తగ్గ నిధులు వాళ్ళ దగ్గర లేవు. ఇదే విషయాన్ని ఆయన ఫాదర్ కు చెప్పారు. ఆయన అన్నారట మాంచొ మంచి పనిచేయాలని అనుకున్నపుడు డబ్బు గురించి ఆలోచించవద్దు అదే వస్తుంది అని. అలా మొండి ధైర్యంతో ఆస్పత్రి ప్రారంభించారు. అది ఇప్పుడు జిల్లాలోనే పేదలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆస్పత్రి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉంది. ఈ విషయాన్ని జీవని ఆశ్రమం శంకుస్థాపన రోజున ముఖ్య అతిథిగా వచ్చిన మాంచో ఫెర్రర్ చెప్పారు. ఇదే మాకు కూడా స్ఫూర్తి. 


జీవనికి కార్పస్ ఫండ్ లేదు, నెలకు 30 వేల రూపాయల డెఫిసిట్తో నడుస్తోంది, అయినా 1 సంవత్సర కాలంగా ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడలేదు. వస్తూనే ఉన్నాయి. సమయానికి ఎవరో ఒకరు స్పందించి  ఆదుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు  తెలియజేస్తున్నాము.

ఇక 75,000/- విరాళం దగ్గరికి వస్తే తెలుగు బ్లాగర్ రెహమాన్ తన మిత్రుడు వినీల్ ను పరిచయం చేసారు, ఆయన శ్రీ గారిని, వారి మిత్రులు శ్యాం గారు , ఫైనల్గా శ్యాం గారి ఫ్రెండ్స్. వీరందరూ కలసి విరాళం పంపారు.
వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది బాలికల వసతి గృహానికి మొదటి డొనేషన్. ఈ నిర్మాణానికి అంచనా వ్యయాన్ని తర్వాతి టపాలో తెలియబరుస్తాము.


Santosh Krishnamoorthy - 6000
 
Kishore Kumar - 6000
 
Bhargav Tadepalli - 6000
 
Sreekanth Kamineni - 6000
 
Ronak Tak - 6000
 
Rahul Sowmian - 6000
 
Ramshankar Subbaiah - 6000
 
Upendar Rao Peram - 6000
 
Ravi Kiran Reddy Chada - 6000
 
Sarat Apparasu - 3000
 
Jitendra Yarlagadda (Sri's friend) - 3500
 
Shyam Kandala - 14500
 
*  ఈ విరాళం చాలా రోజుల కిందటే అందింది. అయితే ఇంటర్నెట్ కనెక్షన్ లేక పోస్ట్ పెట్టడం ఆలస్యం అయింది. 
thank you

on
categories: | edit post

1 Responses to బాలికల డార్మిటరీ నిర్మాణానికి శ్రీకారం - 75,000/- విరాళం

  1. Anonymous Says:
  2. Sir,
    I request u that
    what ever the good things
    u r carrying,
    plz. mention them with
    ADDRESSES
    so that those who are interested
    can visit and
    c ur current developments.
    Quiz antaaru, manchi viraalamu building ki antaaru, kaani
    ekkada chestunnaru ???
    these are the questions for the general visitors and myself who is presently in Hyderabad,
    U put a permanant link for your addresses for new POSTS and new DEVELOPMENTS for the new visitors.

    Plz. don't mind being myself Anonymous.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo