అనంతపురంలో జీవనికి చేదోడువాదోడుగా నిల్చే సంస్థల్లో పవిత్ర హైపర్ మార్ట్ ఒకటి. కొద్ది నెలల కిందట ప్రారంభించిన పవిత్ర మార్ట్, కొద్దిరోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో విరాళాల కలెక్షన్ బాక్స్ ఉంచారు. కస్టమర్లతో పాటు యాజమాన్యం కూడా విరాళాలు అందులో వేసారు. ఇది 5600/- అయింది. నిజానికి చాలా రోజుల కిందటే బాక్స్ ఓపెన్ చేసాము. కానీ వరుసగా టపాలు పెట్టవలసి వచ్చి ఇది ఆలస్యం అయింది. పవిత్ర మార్ట్ మేనేజింగ్ పార్టనర్లు వంశీ మోహన్ రెడ్డి, నరేంద్ర...

శెట్టూరులో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న బాబూరావు, చాలా రోజుల నుంచి పిల్లలకు బ్లడ్ గ్రూపింగ్ చేద్దాం అంటున్నారు. నిన్నటికి తీరింది. ఇందుకు కావలసిన సరంజామాను బాబు సోదరుడు, AFFLATUS GLOBAL SCHOOL ప్రిన్సిపాల్ సాల్మన్ స్పాన్సర్ ( 3500/- ) చేసారు. గ్రూపింగ్ తోపాటు, HIV TEST కూడా చేసారు. వీరికి శ్యాం సహాయం చేసారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సునీత మొదటినుంచీ ఏడుస్తూ చాలా బాధపడి రక్తం ఇచ్చింది. కానీ...

నరేంద్ర జయంత్ గారు చక్కటి డెంటిస్ట్ ( ఎప్పుడో పదేళ్ల కిందట మా కుటుంబ సభ్యులకు పన్ను తీసేసి క్యాప్ పెట్టారు, ఇప్పటికీ ఎలాంటి సమస్య లేదు ). ఆయన కొద్దిరోజుల కిందట డాక్టర్ హరిప్రసాద్ ( ప్రత్యూషకు అపెండిసైటిస్ చేసారు) తో కలిసి జీవనికి వచ్చారు. ఆ రోజు ఆయన బర్త్ డే. సరే పనిలోపనిగా పిల్లల పళ్ళు చెక్ చేసారు. వారిలో సందీప్ కు కాస్త డేంజర్ ఉంది అని చెప్పారు. తీసుకురండి ట్రీట్మెంట్ ఇద్దాం అన్నారు. పనుల హడావిడిలో మేము మర్చిపోయాము. నిన్న సందీప్ పన్ను...

మిత్రులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు జీవని పిల్లలతో ఇలా...
శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియెంటేషన్ కార్యక్రమం కోసం ఆయన అనంతపురం వచ్చారు.
రఘూ ధన్యవాదాలు......

మిత్రులారా బాలికల డార్మిటరీకి అంచనా ( పూర్తి స్థాయి ) 15,00,000/- అయితే ఇప్పటిదాకా వచ్చిన విరాళాలు 3,22,871/- ఒక చిన్న విన్నపం గత కొద్దిరోజులుగా జీవనికి ఆదాయపు పన్ను మినహాయింపు, జీవని విద్యాలయం రికగ్నిషన్ పనులతో బిజీగా ఉన్నాము. ఒకవేళ ఎవరైనా విరాళం ఇచ్చి ఇక్కడ చూపకపోతే దయచేసి క్షమించండి. మెయిల్ చేయండి. దీన్ని మా నిర్లక్ష్యంగా భావించవద్దని మనవి. ఇక 10,000/- పైన వచ్చే విరాళాలు డార్మిటరీకి మళ్ళిద్దాం అనుకున్నాము. మిగతావి జీవని నిర్వహణకు...

అనంతపురం వృత్తివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు రోటరీపురం గ్రామంలో 7 రోజులపాటు NSS క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా 3 రోజులు జీవనిలో గ్రౌండ్ క్లీనింగ్, చదును చేశారు. కళాశాల విద్యార్థులకు, ప్రిన్సిపల్ ఈశ్వర రెడ్డి గారికి, NSS కో ఆర్డినేటర్ కొండన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
జీవని కార్యదర్శి, SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యం ఎడమ నుంచి కుడికి : Sri.Kondanna, NSS coordinator;...
శ్రీమతి అగ్తు పుష్పావతి మరియు శ్రీ అగ్తు వరప్రసాద రెడ్డి గారి పేరు మీద వారి కుమారుడు శ్రీ రామకృష్ణా రెడ్డి, శ్రీమతి మంజూష గార్లు ఈ విరాళం అందించారు. రామకృష్ణా రెడ్డి గారు అట్లాంటాలో ఉంటున్నారు. వీరు జీవనికి చాలా కాలం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరందరికీ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
...

పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీ మనోజ్ నందమూరి శ్రీమతి హేమ నందమూరి గార్లు కొత్త ఇంటిలో ప్రవేశించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె నేహ నందమూరి స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. పిల్లల సౌలభ్యం కోసం స్పెషల్ మీల్స్ ఆదివారం అరేంజ్ చేయనున్నాము. నందమూరి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము.
...

బ్లాగర్ శంకర్ గారి శ్రీమతి స్వాతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా శంకర్ గారి బ్లాగు మిత్రులు జీవనికి 5000/- విరాళం అందించారు. సోదరి స్వాతి గారికి మంచి జరగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కార్తీక్ కుమార్ రెడ్డికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. కార్తీక్, చంద్రమౌళి రెడ్డి గారి రెండో అబ్బాయి. వీరు జీవనికి వచ్చి పిల్లలకు స్వీట్లు, సమోసా ఇచ్చారు. చంద్రమౌళి గారి మొదటి అబ్బాయి ఈశ్వర రెడ్డి లుకేమియాతో...

జీవని ప్రారంభం నుంచి ఇంతవరకూ పిల్లలకు ఎవరికీ తీవ్రమైన ఆరోగ్య సమస్య రాలేదు. మొదటిసారిగా సాయి ప్రత్యూషకు అపెండిసైటిస్ వచ్చింది. సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి ఫోన్ చేసాను. తీసుకురా చేసేద్దాం అన్నారు. ఒక్కపైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ అయిపోయింది. అంతకంటే ముఖ్యం ప్రత్యూషను ఇంకా అడ్మిట్ చేయలేదు, నేను హరితో మాట్లాడుతుండగా రెండు కేసులు వచ్చాయి. బెడ్స్ ఖాళీ లేవు ఇప్పుడే ఒక అమ్మాయి ( ప్రత్యూష ) అడ్మిట్ అయింది అని చెప్పారు. హరి గారు నడుపుతున్న చిన్నారి...
మిత్రులారా గడచిన వారం రోజుల నుంచి ఏకబిగిన కార్యక్రమాలు, వరుసబెట్టి బర్త్ డేలు, మధ్యలో సాయిప్రత్యూషకు అపెండిసైటిస్ ఆపరేషన్, జీవనిలో ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమం మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. ప్రత్యూష ఇప్పుడు బావుంది. జీవని ప్రారంభం అయ్యాక ఆరోగ్య పరంగా వచ్చిన మొదటి పెద్ద సమస్య. అనంతపురంలో ప్రముఖ సర్జన్, సోదరులు హరిప్రసాద్ చాలా తక్కువ ఖర్చులో ఆపరేషన్ చేసారు. వీటన్నిటికి సంబంధించి విడివిడిగా టపా పెడతాము. మాకున్న మానవ వనరులు తక్కువ, జీవని నిర్వహణ మొత్తం ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారు. ఈ హడావిడిలో ఎవరికైనా మెయిల్స్ రిప్లై ఇవ్వడం...

అమెరికాలో ఉంటున్న నాగార్జున రెడ్డి మరియు శ్రీమతి స్రవంతి గార్ల కుమారుడు సుహాస్ రెడ్డి పుట్టిన రోజు 13వ తేదీన. సుహాస్ కు ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు జీవనికి 15000/- విరాళం ఇచ్చారు. నాగార్జున గారు ప్రతి సంవత్సరం 25,000/- విరాళం ఇస్తున్నారు. వారి సహాయ సహకారాలకు పిల్లల తరఫున కృతఙ్ఞతలు.
file photo
file phot...

దోహాలో ఉంటున్న శ్రీ బుక్కపట్నం రమేష్ మరియు శ్రీమతి ఆషాలత గార్ల కుమారుడు వెంకట నితిన్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా వారు పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
...

అనంతపురం జిల్లా బత్తలపల్లిలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీ సంజీవరెడ్డి, శ్రీమతి లావణ్య గార్ల కుమారుడు ఉదయశేఖర రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు, నూనె, సోపులు తదితర నిత్యావసరాలు విరాళంగా ఇచ్చారు. వారితోపాటు ఆంజనేయ ప్రసాద్ గారు, సిసి టు కళ్యాణదుర్గం డిఎస్పీ, గణేష్ కుమార్, గ్రామ కార్యదర్శి, ఆత్మకూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరికీ ధన్యవదాలు తెలియజేస్తున్నాము.
...
చక్కటి కవితలు, కథలు, స్వగతాలు కలగలిపిన బ్లాగు మురళీగానం. దాన్ని ఆలపిస్తున్న బ్లాగర్ నాగమురళీధర్ గారు. మురళి గారి పుట్టినరోజు నేడు అలాగే మ్యారేజి డే కూడా. మురళి, శ్రీమతి ఝాన్సి దంపతులకు జీవని పిల్లల తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు 5000/- విరాళం అందించారు. వారికి ధన్యవాదాలు. అన్నట్టు మురళి గారి బోనస్ బ్లాగ్ మహానగరం. అందులో జానపద సీరియల్ రాస్తున్నారు.
http://muralidharnamala.wordpress.com
http://mahanagaram.wordpress.com/
http://facebook.com/nnmuralidhar
http://twitter.com/muralidharnn
https://profiles.google.com/muralidhar.namala/buzz
మురళిగారి...
స్వర్గీయ ఆలూరు పుల్లారెడ్డి గారి ( జీవని ప్రధాన కార్యదర్శి, SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి గారి సోదరులు ) స్మృతిలో వారి సతీమణి ఆలూరు రాజేశ్వరమ్మ గారు నిన్న జీవనిలో స్పెషల్ మీల్ స్పాన్సర్ చేసారు. 1000/- విరాళంగా ఇచ్చారు. జీవనిలో నీళ్ళు, కరెంటు, నిర్మాణం ఇలా ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి చేదోడువాదోడుగా ఉండే ఆలూరు నాగశేషారెడ్డి వారి సతీమణి శ్రీమతి రమాదేవి, కోడలు శ్రావణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ...

జీవని ఆశ్రమం ప్రారంభించాక ఇది రెండవ దీపావళి.ఈసారి పటాసులు స్పాన్సర్ చేసినవారు
1. Chandrakanth Naidu, Anantapur Surgicals
2. Chandra Mohan Reddy, PA to MLA, Anantapur
3. Gnaneswara Reddy, Asst. Admin. Officer, Afflatus Global School, Anantapur
4. Jagadeesh, Crackers shop no. 9, ATP
5. Jahnavi
6. Pavithra Voluntary Organisation, Anantapur
7. Rangaiah, Commissioner, Anantapur Municipal Corporation
8. Seshasayana Reddy, Director, Afflatus...