బ్లాగు, గూగుల్ ప్లస్, ఫేస్ బుక్ మిత్రులకు, జీవని కుటుంబసభ్యులకు పిల్లల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జీవనిలో నూతన సంవత్సర వేడుకలు ఎలా జరగాలని ప్లాన్ చేసామంటే....

INSPIRE - 2014      లేదా     ప్రేరణ - 2014
ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చేసిన స్పీకర్ మాడుగుల చంద్రశేఖర శర్మ. కొద్ది రోజుల కిందట శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల కలయికలో ఈ అబ్బాయి మాట్లాడారు. ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ సెర్చ్ లో ఉన్నాడు. బీటెక్ విద్యార్థి సంస్కృత శ్లోకాలు పదబంధాలను విడమరచి చెప్పడం అద్భుతం అనిపించింది. చెప్పిన తీరు, దృక్పథం చాలా బావున్నాయి.

చంద్రశేఖర్ తో మాట్లాడి, పిల్లలకు మోటివేషనల్ క్లాస్ ఇవ్వాలని కోరగా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇక జీవని కోర్ గ్రూపు సభ్యులు కూడా తలా 2 నిమిషాలు తము వ్యక్తిగతంగా భూత వర్తమాన భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష చేసి పిల్లల ముందు చెప్పాలి. పిల్లలు కూడా తాము గత సంవత్సరం చేసిన తప్పులు, కన్‌ఫెషన్... 2014లో ఎలా ఇంకా ఇంప్రూవ్ కావాలి అని మాట్లాడాలి. ప్రోగ్రాం రాత్రి 10 గంటలకు మొదలై 12 గంటలకు అయిపోతుంది. 12 గంటలకు కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరూ  తమ లక్ష్యాల గురించి గట్టిగా నినదిస్తూ 2014లో అడుగుపెట్టాలి. లక్ష్యసాధనకు కొత్త సంవత్సరానికి సంబంధం ఉండదనుకోండి. కానీ ఈ విషయం పిల్లలకు తెలీదు కదా 2014 పేరుతో వాళ్ళలో ఉత్తేజం నింపడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కాన్సెప్టు చెప్పిన మిత్రులు, ఈనాడు జర్నలిస్ట్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు.

మరి ఒరిజినల్గా జరిగిందేమిటి ?

డిసెంబర్ 31వ తేదీన ఉదయం వాంతులు విరేచనాలతో నేను ( ప్రసాద్ ) ఆస్పత్రి పాలవడం. పూర్తిగా కోలుకుని ఈ సాయంత్రం తిరిగి జీవనిలో అడుగుపెట్టాను. అప్పుడెప్పుడో ఆరేడేళ్ళ కిందట చికున్ గన్యా అలియాస్ చికెన్ గునియా వచ్చినపుడు ఆస్పత్రిలో చేరాను. సుదీర్ఘ విరామం తర్వాత ఇలా మళ్ళీ వెళ్ళాను. 

జీవని బ్లాగు, ముఖపుస్తకం అప్డేట్ లేకపోవడానికి ఇది కారణం.

మరోసారి అందరికీ శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు అనుక్షణం ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము. జీవని పిల్లల్ని ఆర్థికంగా నైతికంగా ఆశీర్వదిస్తున్న దయార్ద్ర హృదయులకు ధన్యవాదాలు.


on
categories: | edit post

5 వ్యాఖ్యలు

 1. అయ్యో. ప్రస్తుతం అంతా బాగానే ఉంది కదండీ మీకు.

  కొత్త సంవత్సరంలోనే అని ఏముంది లెండీ,ఉగాదికి ప్లాన్ చెయ్యండి ఇవే కార్యక్రమాలు బావుంటుంది.

   
 2. jeevani Says:
 3. పప్పుగారూ నేను బావున్నాను. మీ సలహా బావుంది. తప్పక అమలుచేస్తాం. ధన్యవాదాలు.

   
 4. అయయ్యో... ఈ సంవత్సరం నుండీ ఇక ఇలాంటి షాకులు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను.
  Take care ప్రసాద్ గారూ.

   
 5. jeevani Says:
 6. thank you Raj

   
 7. ఆరోగ్యం జాగ్రత్త ప్రసాద్ గారూ.

   

Blog Archive

Followers