మా సమీప బంధువు రాజు గురించి చెప్పాలి. గత మూడు సంవత్సరాలుగా రాజు వాళ్ళ నాన్న గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గడచిన సంవత్సరం చెల్లి డెలివరీకి రావడం... తన ఉద్యోగం ఆ అబ్బాయిని ఉక్కిరిబిక్కిరి చేసాయి. అన్ని పనులు ఓపిగ్గా చేసుకునేవాడు. ఏ రోజూ విసుగు పడలేదు. ఇలాంటి వారిని చూసినపుడు, మానవసంబంధాలపై కోల్పోయిన నమ్మకం ఒక్కసారిగా పునరుజ్జీవనం పొందుతుంది. రాజు లాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లోనూ కనీసం ఒకరైనా ఉంటారు. ఒక్కసారి కనీసం ఒక్కసారి వారిని చూసి స్ఫూర్తిని పొందితే... అమ్మానాన్నల కేరాఫ్ అడ్రస్ వృద్ధాశ్రమాలు ఎందుకు అవుతాయి. ఇంకా ఆస్పత్రిలోనే ఉన్న రాజు నాన్నగారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. Don’t stay away from Your Parents and leave them When they Need you the Most . You would never be able to Pay back in life what all they have done for You .


note:  ఈ పోస్ట్ ఉద్దేశం హితోపదేశం కాదు, భావ వ్యక్తీకరణ మాత్రమే. ధన్యవాదాలు. 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers