శ్రీనివాసుల రెడ్డి ( సబ్ రిజిస్ట్రార్, అనంతపురం రూరల్ ), నాగలక్ష్మి దంపతులు తమ కుమారుడు చి. చైతన్య పుట్టినరోజు సందర్భంగా జీవని పిల్లలకు దుస్తులు స్పాన్సర్ చేశారు. వారికి జీవని తరఫున కృతఙ్ఞతలు....
మిత్రులారా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతూ బెంగుళూర్ సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ గారు డిస్చార్జ్ అయ్యారు. ఆమెకు రక్తం యూనిట్లు అవసరం అనగానే మన బ్లాగర్లు చక్కగా స్పందించారు. పది యూనిట్లు బ్లాగర్ల తరఫున వచ్చాయి. వారి సహృదయతకు మరో మారు ధన్యవాదాలు. రమ గారు కోలుకున్నారు. తిరిగి పరీక్షలు వగైరాలు మామూలే. ఆమె ఇల్లు చేరుకున్నారు.ప్ర.పీ.స.స. బ్లాగులో 10 రోజులపాటు రక్తం యూనిట్ అవసరంపై టపా పెట్టిన కార్తీక్ కు, తాడిపత్రిలో ఉన్నా వెంటనే స్పందించి రక్తదాతను పంపిన విజయమోహన్ ఇంకా సందీప్, దిలీప్ రెడ్డి తదితర మిత్రులకు రమ గారి తరఫున...
శ్రీ శివప్రసాద్, శ్రీమతి అరుణకుమారి దంపతులు తమ కుమారుడు చి. యఙ్ఞ అక్షయ్ పుట్టినరోజు సందర్భంగా జీవని పిల్లలు అందరికీ కొత్త దుస్తులు పంపిణి చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము....
ఒక వ్యక్తి దారిలో వెళ్తుంటే ఒక చిన్న పిల్లవాడు చలికి గజగజ వణుకుతూ, ఆకలికి నకనకలాడుతూ కనిపించాడు. ఆ వ్యక్తి వెంటనే దేవుడిని ప్రార్థించాడు " భగవాన్ ఏమిటీ అన్యాయం ముక్కుపచ్చలారని ఆ పసికందు ఏమి పాపం చేశాడు? వాడికి ఎందుకు అంత శిక్ష విధించావ్? వాణ్ణి కాపాడు " అని గట్టిగా ప్రార్థించాడు. చాలాసేపు చూశాడు ఎవరూ రాలేదు.దేవుడికి ఎంత నిర్దయ అనుకుంటూ ఆ వ్యక్తి ముందుకు కదలిపోయాడు. రాత్రికి అతనికి కల వచ్చింది. కలలో దేవుడు ఇలా అన్నాడు " నేను పిల్లవాడికి సహాయం చేయకపోవటం ఏంటి? నేను నిన్ను అక్కడికి అందుకే కదా పంపాను " జీవని విద్యాలయం బ్రోచర్ కోసం...
మిత్రులారా రమ అనే ఆవిడ ల్యుకేమియాతో బాధపడుతున్న విషయం ఇంతకుముందు పోస్టులో తెలిపాము. ఆమె సెయింట్జాన్స్ ఆస్పత్రి, బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు. ఆమెకు రక్తం యూనిట్లు అవసరం అని చెప్పగానే బ్లాగర్ల తరఫు నుంచి 10 మంది స్పందించి రక్తదానం చేశారు. ఆమె ప్రస్తుతం బాగా కోలుకున్నారు పరిస్థితి ఇంకొంచెం మెరుగు పడితే ఓ 10 రోజులకు డిస్చార్జ్ కావచ్చని డాక్టర్లు తెలిపారు. కేన్సర్ కణాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిందని వాళ్ళు చెప్పారు. కానీ రక్తం యూనిట్లు మాత్రం ఇంకా అవసరం అవుతున్నాయి, కాబట్టి మిత్రులు ఎవరైనా వుంటే మొబిలైజ్ చేయవలసిందిగా కోరుతున్నాము....
24014 - opening balance16600 - donations received in this month--------------------------40614 - total20635 - expenditure--------------------------19979 - balance--------------------------EXPENDITURE============10000 - school fees10000 - minimum balance in SBI00225 - oil, soaps etc...00410 - medical bill ( skin problems for BHASKAR & ASHOK )అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి... Join hands with...JEEVANI......FOR UNCARED contact : jeevani.sv@gmail.com 94405471...
" sunnygadu said... ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుపగలరు November 24, 2009 11:16 AM " మిత్రులారా ల్యుకేమియాతో బాధపడుతున్న రమ గారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ట్రీట్మెంట్ దీర్ఘకాలానికి సంబంధించినది అంటే మూడు నెలల పాటు సాగుతుంది కాబట్టి ఫలితం కూడా ఆలస్యంగానే ఉంటుందని డాక్టరు చెప్పారు. సందీప్ మీ CONCERN కు ధన్యవాదాలు. ...
మిత్రులారా రక్తదానం కోసం ఒక ట్రయల్ అన్నట్లు బ్లాగులో పెట్టడం జరిగింది. అయితే ఇంత స్పందనను ఊహించలేదు. మొత్తం 8 మంది పేషెంటు తరఫు వ్యక్తిని కలిశారు. కానీ వివిధ కారణాల వల్ల అంటే అంతకు ముందే మాత్రలు వేసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటం తదితరాల వల్ల నలుగురి రక్తాన్ని ఆస్పత్రి వాళ్ళు వద్దన్నారట. ఆమె లుకేమియ పేషెంటు కాబట్టి ఎంటువంటి ఇంఫెక్షన్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టరు చెప్పారట. రక్తదానం చేసిన వారి వివరాలు. 1) ఎల్.లక్ష్మీనాథ్, సఫ్ట్ వేర్ ఇంజనీర్, విప్రో ( చిలమకూరు విజయమోహన్ @ లీలా మోహనం బ్లాగు గారు పంపారు ) 2) కార్తీక్...
మిత్రులారా రమ అనే పేషెంటు ప్రస్తుతం బెంగుళూరు సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్సకు 60 యూనిట్ల రక్తం అవసరం అవుతుంది. రక్తపు గ్రూపుతో సంబంధం లేదు ఏ గ్రూపు అయినా సరే. ఎవరైనా దాతలు ఉంటే 08099661612 ( ఇది ఆంధ్రా రిలయన్స్ నెంబరు, ల్యాండ్ లైన్ అనుకుని నెంబరు తప్పు అని అనుకోకండి ) , 9440601316 కు మిస్సెడ్ కాల్ ఇవ్వండి చాలు. మీ మిత్రులు ఎవరైనా బెంగుళూరులో ఉన్నా ఒక మెసేజి పంపి దాన్ని ఫార్వర్డ్ చేయించండి. మేము ఇప్పటికే చేసిన ప్రయత్నం సఫలం అయింది. కొందరు సంప్రదించారు. విషాదం ఏమంటే...

వషీదా అంటే ఏ బాలీవుడ్ హీరోయిన్నో అనుకునేరు. కాదండీ! వషీదా ఒక బొమ్మ. ఆ బొమ్మను రెండేళ్ల కిందట ఇదే రోజున కొన్నారట! ఆ కొన్న అమ్మాయి పేరు సల్మా , 5 వతరగతి. నా క్లాసులోని పిల్లలు. తమకు ఉన్నంతలో 3 రూపాయలు పెట్టి కోవా బిళ్ళలు కొని మా ముగ్గురు టీచర్లకు ఇచ్చారు. వషీదాకు ఒక లడ్డు, 2 చాక్లెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ బహుమానంగా వచ్చాయి. అది పిల్లలు అందరూ సమానంగా పంచుకున్నారు. నేను సల్మాకు పెన్ను బహుమానంగా ఇచ్చాను....
బ్లాగేతర జీవని సభ్యులకు భరద్వాజ గారిని పరిచయం చేస్తున్నాము. మిత్రులారా కిందటి నెల మనం నిర్వహించిన వరద బాధితుల సహాయ కార్యక్రమం ద్వారా జీవని సంస్థ అనేది ఒకటి ఉందని ప్రజలకు తెలిసింది. ( ప్రచారానికి మనం ముందు నుంచి దూరంగా ఉన్నాం ) మనకు సేవ చేసే భాగ్యం, తృప్తి కలిగింది. ఇందుకు ఎందరో ఉదారంగా విరాళాలు పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు. అయితే విదేశాల్లో ఉంటున్న తెలుగు బ్లాగర్లను సంప్రదించి వారి నుంచి విరాళాలు సేకరించి కో ఆర్డినేట్ చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తి భరద్వాజ గారు. భరద్వాజ గారికి జీవని పిల్లల...
మిత్రులారా SBI లో కూడా మన సంస్థ అకౌంటు ప్రారంభించాము. ICICI వారి వడ్డనలు భరించలేక, కమ్యూనికేషన్ పరంగా ఉన్న సమస్యలు మొదలైన అన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నాము. నెలవారీ విరాళం పంపుతున్న దాతలకు విఙ్ఞప్తి ఏమంటే మీకు ఇబ్బంది లేకపోతే ఇకనుంచి మీ విరాళాన్ని SBI A/C కి పంపండి. మీరు ఇబ్బంది అనుకుంటే ICICI తోనే కొనసాగించవచ్చు. అకౌంటు నెంబరు: 30957763358 TREASURY BRANCH, ANANTAPUR, 12831, CURRENT ACCOUNT Join hands with...JEEVANI......FOR UNCARED contact : jeevani.sv@gmail.com 94405471...
మిత్రులారా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు జరుగుతుంటాయి. వరద సహాయం కోసం డబ్బు పంపి మాకు కమ్యూనికేట్ చేయని వాళ్ళ జాబితా ఇపుడు మీ ముందు ఉంచుతున్నాము. నిన్న బ్యాంకు స్టేట్ మెంటు వచ్చినపుడు చూశాము. మేము ఇక్కడ ఒక ఇబ్బంది ఎదుర్కుంటున్నాము. ICICI బ్యాంకు వాళ్ళు మీది స్వచ్చంద సంస్థ కాబట్టి మేము పూర్తి సర్వీస్ ఇవ్వం అంటున్నారు. పాస్ బుక్ ఎలానూ ఉండదు, నెట్ బ్యాంకింగ్ లేదు, స్టేట్ మెంట్ అడిగితే దానికి వడ్డింపులు, కాబట్టి నేను వ్యక్తిగతంగా ప్రతి సారీ బ్యాంకుకు వెళ్ళి బ్యాలెన్సు వివరాలు కనుక్కోవలసి వస్తోంది. ఫోన్ చేసినా ఫోన్ బ్యాంకింగ్...
మిత్రులారా కర్నూలు వరద బాధితులకు సహాయం అందించడంలో జీవని స్వచ్చంద సంస్థ పూర్తి స్థాయిలో విజయం సాధించింది. ఐదు రోజుల పాటు బాధితుల చెంతకే వెళ్ళి మన చేతుల మీదుగా వివిధ వస్తువులు పంపిణీ చేశాము. ఇందుకు ఆర్థికంగా సహకరించిన అందరికీ జీవని తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. అమెరికా, జెర్మనీ మరియు తెలుగు మహిళా బ్లాగర్లు ఇంత స్థాయిలో సహాయం అందించకపోతే ఇంత భారీగా మన కార్యక్రమం జరిగేది కాదు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మా ధన్యవాదాలు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. కింది సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారు...
BALANCE AS ON 30.09.2009 -17848DONATIONS COLLECTED IN OCTOBER - 6166-------------------------------------------TOTAL AMOUNT 24014EXPENDITURE 00000---------------------------------------------BALANCE AS ON 31.10.2009 24014--------------------------------------------- regards,JEEVANI,ANANTAPU...
మిత్రులారా ఇది ప్రాథమిక అంచనా. ఈ సంఖ్య నిధుల లభ్యతని బట్టి ఉంటుంది. నిధులకు ఇబ్బంది అయితే మనకు తప్పనిసరిగా అవసరం అయ్యేవి మాత్రమే కట్టుకుంటాము.తరగతి గదులు - 7స్టాఫ్ రూములు - 2ప్రధానోపాధ్యాయులు & కార్యాలయ సిబ్బంది - 1జీవని కార్యాలయం - 1గ్రంథాలయం - 1ల్యాబ్ - 2 ( కంప్యూటర్, ఇతర సబ్జెక్టులు ) సెమినార్ హాలు - 1 హాస్టల్ గదులు పెద్దవి - 4స్టోర్ రూము + వంటగది + భోజన శాల - 1టీచర్లకు క్వార్టర్స్ - 3నాన్ టీచింగ్ సిబ్బందికి - 3 టాయిలెట్లు - అవసరమైనన్ని కంప్యూటర్లు ఓ 10 సమకూరితే అపుడు ల్యాబ్ కు బదులు క్లాస్ కు ఒకటి పెడితే ఎలా ఉంటుంది?...
మిత్రులారా జీవని చరిత్రలో మరో మైలు రాయి. శ్రీ రంగారెడ్డి గారు,PRINCIPAL, SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR జీవనికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా 5 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. ఈ స్థలం అనంతపురానికి 19 కిలోమీటర్ల దూరంలో గార్లదిన్నె సమీపాన ఉంది. ఇది మంచి సారవంతమైన, నీటి వనరులున్న ప్రాంతం. బెంగుళూరు - హైదరాబాదు హైవే పక్కనే ఈ స్థలం ఉంది. ఈ స్థలం విలువే దాదాపు 25 లక్షలు ఉంటుంది. రంగారెడ్డి గారి వితరణకు జీవని హృదయ పూర్వకంగా కృతఙ్ఞతలు తెల్పుతోంది. శ్రీ. సాంబశివా రెడ్డిగారు SECRETARY & CORRESPONDENT,...