మిత్రులారా జీవని చరిత్రలో మరో మైలు రాయి. శ్రీ రంగారెడ్డి గారు,PRINCIPAL, SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR జీవనికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా 5 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. ఈ స్థలం అనంతపురానికి 19 కిలోమీటర్ల దూరంలో గార్లదిన్నె సమీపాన ఉంది. ఇది మంచి సారవంతమైన, నీటి వనరులున్న ప్రాంతం. బెంగుళూరు - హైదరాబాదు హైవే పక్కనే ఈ స్థలం ఉంది. ఈ స్థలం విలువే దాదాపు 25 లక్షలు ఉంటుంది. రంగారెడ్డి గారి వితరణకు జీవని హృదయ పూర్వకంగా కృతఙ్ఞతలు తెల్పుతోంది. శ్రీ. సాంబశివా రెడ్డిగారు SECRETARY & CORRESPONDENT, SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR 5 లక్షలు విరాళం ఇస్తానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే.


వీటిని బేరీజు వేసుకుని 13.06.2011న జీవని హాస్టల్ మరియు పాఠశాలను ప్రారంభించాలని టెంటేటివ్ గా నిర్ణయించాము. దీన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇక పని చేస్తాము. 50 మంది జీవని పిల్లలతోను 160 మంది బయటి పిల్లలతోను స్కూల్ ప్రారంభం అవుతుంది. ( LKG - 5వ తరగతుల వరకు తరగతికి 30 మంది చొప్పున) బయటి పిల్లలతో కూడా వీలైనంత తక్కువ ఫీజులు వసూలు చేస్తాము. టీచర్ల జీతభత్యాలకు వీటిని వాడటం జరుగుతుంది. జీవని పిల్లల హాస్టల్ ఖర్చుకు ఇప్పటిలాగే విరాళాలు స్వీకరిస్తాము. భవిష్యత్తులో దాతలు పెరిగే కొద్దీ బయటి పిల్లలను తీసుకోవడం తగ్గిస్తాము. ఈ ప్లాన్ కేవలం సేఫ్ సైడ్ గా ఉండటం కోసమే. చివరకు దాతలు పూర్తి స్థాయిలో వచ్చినపుడు మన స్కూల్లో కేవలం జీవని పిల్లలు మాత్రమే ఉంటారు.


ఇద్దరు దాతల ఫోటోలతో ఈ టపాను తిరిగి అప్ డేట్ చేస్తాము.అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

6 వ్యాఖ్యలు

 1. venu Says:
 2. congratzz.. this is a good mile stone..

  but be careful also.. this is the time where selfish ness enters into one's self..

  am not pointing u.. but speakin in general.. sorry if u r hurt..

   
 3. ఈ రోజుల్లో ఎంత డబ్బున్న వారైనా మూడెకరాల స్థలం ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. దానితో పాటు విరాళం కూడా! ఈ చేయూతతో జీవని మరింతగా అభివృద్ధి చెంది సేవా కార్యక్రమాల్లో ముందంజ వేయాలని ఆకాంక్షిస్తున్నాను. రంగారెడ్డి, సాంబశివారెడ్డి గార్లకు అభినందనలు! గొప్ప విశాల హృదయం వారిది.

   
 4. jeevani Says:
 5. సుజాత గారూ ధన్యవాదాలు,

  వేణు గారూ మీరు చెప్పింది నిజం. ఇందులో హర్ట్ అవాల్సింది ఏమీ లేదు. జీవని కోసం పనిచేస్తున్న వారిలో ఎవరూ సంకుచితంగా ఆలోచించేవారు లేరు. అయినా మీ సూచనను మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకునే మసలుతాం. నిజానికి ఈ జాగ్రత్త కోసమే జీవని బ్లాగులోకానీ సంస్థకు సంబంధించిన ఇతర వ్యవహారాల్లోగానీ వ్యక్తి పూజను పూర్తిగా నిషేధించాము. ఇది అందరిదీ అన్న భావన అందరిలో కలిగించగలిగాము. సేవా దృక్పథం ఉన్న వారికి ఇది ఒక ప్లాట్ ఫాం మాత్రమే. అందరం ఇక్కడ కార్యకర్తలే. అలాగే డబ్బు విషయంలో కూడా మాకు చేతనైనంత పారదర్శకంగా పనిచేస్తున్నాము. మామూలుగా ఆఫీసు ఖర్చులు, ఫోను, పెట్రోలు బిల్లుల రూపంలో ఎంజీవోలు డబ్బును డైవర్ట్ చేస్తుంటాయి. అందుకే అవేవీ లేకుండా దాత ఇచ్చే ప్రతి పైసా కూడా పిల్లలకు చేరుతోంది. మీ అందరి సలహాలు, సూచనలు , సహకారం ఇలాగే కోరుతూ ,

  మీ,

  జీవని.

   
 6. శ్రీ రంగారెడ్డి, శ్రీ సాంబశివారెడ్డి గార్లకు అభినందనలు!!! ఇప్పుడే శ్రీ రంగారెడ్డి గారికి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశాము. జీవని మీద వున్న నమ్మకం తోనే ఇంత పెద్ద మొత్తం లో ధన, స్థల విరాళాలు అందాయని చెప్పడానికి గర్వపడుతున్నాను, ఇదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా జీవని, సేవా కార్యక్రమాలలో మరింత వేగంగా దూసకపోవాలని ఆకాంక్షిస్తూ...
  హర్ష వర్ధన్.M

   
 7. jeevani Says:
 8. హర్ష గారూ ధన్యవాదాలు,

  తప్పకుండా మీ అందరి నమ్మకాన్ని నిలబెడతాము. మా శాయశక్తులా పనిచేస్తాము. మీలాంటి వాళ్ళు అనంతపురం వచ్చినపుడల్లా సందర్శించేలా, మన జీవని పిల్లల్ని పలకరించేలా స్కూల్ను తీర్చిదిద్దుతాము.

   
 9. మనస్సున్న మారాజులు ...ఈ రోజులలో కుడా ఇ౦కా ఇ౦తగా భూరివిరాళ౦ ఇచ్చేదాతలు ఉన్న౦డు చాలా చాలా స౦తోష౦ వేస్తు౦ది.మీ కార్యక్రమ౦ దిగ్విజయ౦ కావాలి అని మనఃపుర్తిగా కోరుకు౦టున్నాను.

   

Blog Archive

Followers