మిత్రులారా, కర్నూల్ కు 40 కిలో మీటర్ల దూరంలోని గుండ్రేవుల గ్రామానికి మనం నిన్న సహాయం చేయడం జరిగింది. పూర్తి వివరాలను, జమాఖర్చులను నివేదిక రూపంలో మీ ముందు ఉంచుతాము. ఐతే మేము పూర్తిగా అలసిపోయి ఉన్నాము రేపు ఉదయంకల్లా తయారు చేస్తాము. ఇపుడు ఒకటి రెండు విశేషాలను మీతో పంచుకుంటాము. 350 ప్యాకెట్లు అనుకున్నాము కదా చివరకు 400 చేశాము. అందరికీ అందాయి. మా కష్టానికి, మీ వితరణకు సంపూర్ణమైన న్యాయం జరిగింది. ఆ గ్రామంలో వదరలో చిక్కుకున్న 400 మందిని కేవలం నలుగురు తెప్పల ద్వారా రక్షించారు. మన పంపిణీ ఆ నలుగురు మానవతా మూర్తులతోనే ప్రారంభించాము. వారి పేర్లు కనుక్కోలేకపోయినందుకు, వారి సాహసానికి అదనంగా ఆర్థిక సహాయం చేయనందుకు తీవ్రంగా బాధపడుతున్నాము. చీకటి కావడంతో మా సర్వశక్తులు పంపిణీ మీదే పెట్టాము. ఈ రోజు మాకు ఇది తట్టింది. పూర్తి వివరాలు త్వరలో... అలాగే జీవని కృషి పట్ల సంతృప్తితో, నమ్మకంతో విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఈ ఆదివారం మరో క్యాంప్ కోసం మేము సిద్ధం అవుతున్నాము. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఈ రోజు ఖరారు చేస్తాము. విరాళాలు పెరిగినట్టల్లా మన కార్యక్రమం మరింత ఎక్కువమందికి లబ్ది చేకూరుస్తుంది. కాబట్టి విరాళాలకు ముందుకురవలసిందిగా కోరుతున్నాము.


ఈ మొత్తం కార్యక్రమం విజయవంతం కావడానికి విరాళాలు పంపిన దాతలకు మా కృతఙ్ఞతలు.

ఆర్థికంగా , మానవ వనరులపరంగా సహాయపడుతున్న జీవని సలహాసంఘం చైర్మన్ కె.జగదీశ్వర రెడ్డి ( స్విబ్ ఇంజనీరింగ్ & ఇంఫ్రా డెవెలపర్స్, హైదరాబాద్ ), సాంబశివారెడ్డి ( జీవని సలహా సంఘం సభ్యులు & SRIT engineering college కరస్పాండెంట్, అనంతపురం ),


మమ్మల్ని తట్టి లేపి మీకు అండగా మేము ఉన్నం అంటూ ఉత్తేజపరచిన మనసున్న మలక్ పేట రౌడీ భరద్వాజ్ ( విదేశీ బ్లాగర్ల నుంచి రౌడీ మామూళ్ళు వసూలు చేశారు- వరదబాధితుల కోసం ), మహిళా తెలుగు బ్లాగర్లు ( రమణి, వరూధినిగార్లు లీడ్ తీసుకుని చేస్తున్నారు ) అందరికీ సంస్థ తరఫున ధన్యవాదాలు.


ఇంకా ఎందరో ఉన్నారు అందరి వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి దయచేసి కొంత సమయం ఇవ్వండి.

ఇక ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి జీవని యూత్ బ్రిగేడ్ అధ్యక్షులు గడ్డం సతీష్. మానవవనరులపరంగానూ, బియ్యం సేకరణలోనూ సతీష్ బృందం చేసిన కృషి అంతాఇంతా కాదు. వారందరినీ కూడా మీకు పరిచయం చేస్తాము. రెండు రోజుల పాటు ప్యాకింగ్ మరియు గుండ్రేవులలో పంపిణీ చేయడంలో ఎంతో చిత్తశుద్ధితో వారు పని చేశారు.

మరోసారి అందరికీ ధన్యవాదాలు.

on
categories: | edit post

1 Responses to మీ అందరి మానవత్వానికి మా జోహార్లు

  1. Anonymous Says:
  2. Yes,Really Satish and Batch Did A Great Job In Packing the Items throughout the Night and Distributing them Successfully in Gundrevula.

    Great Work by Jeevani and Team.

    Yours,
    Suresh Reddy Miduthuru

     

Blog Archive

Followers