మిత్రులారా కర్నూల్ వరద బాధితులకోసం ఈ రోజు రేపు అనంతపురం క్లాక్ టవర్ వద్ద జీవని సంస్థ ఒక కౌంటర్ ను ప్రారంభిస్తోంది. మీ మిత్రులు బంధువులు ఎవరు ఉన్నా దయచేసి వారికి తెలియజేయండి. మన ఇంట్లో వృధాగా పడి ఉన్న దుప్పట్లు ఇప్పుడు అత్యవసరాలుగా మారాయి. కాబట్టి మీకు సంబంధించిన వారికి తెలిపరిచి మరి కొంతమందికి సమాచారం పంపమనండి. తాజా సమాచారం ప్రకారం అక్కడికి కావలసినవి దుప్పట్లు, టవాళ్ళు, నిత్యావసర వస్తువులు. నిన్న మనం దాదాపు ఓ పదివేలమందికి మెసేజ్ పంపించాము. అలాగే తెలుగు బ్లాగర్లు సహాయం చేసెట్లు అయితే భారతదేశానికి సంబంధించినంతవరకు విరాళం ఇవ్వడానికి ramanisreepada@gmail.com, ఇతర దేశాల్లోని భారతీయులు bharadwaja@yahoo.com సంప్రదించండి.



తాజా అంచనాల ప్రకారం 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తోంది. అనంతపురంలోనే మాకు చలిగా ఉంది. అలాంటిది అక్కడ పరిస్థితి తల్చుకుంటే గుండె తరుక్కుపోతుంది. చిన్న పిల్లలు ఎంతగా విలలలాడుతుంటారో అని ఊహించడానికే బాధగా ఉంది. మీరు ఇచ్చే విరాళం కొద్దిగానైనా సరే వారికి ఎంతగానో సహాయపడుతుంది. తక్కువని మొహమాటంపడకండి, ఎంత ఇవ్వాలో అని ఆలోచించకండి మీకు చేతనైనంత సహాయపడండి.

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

  1. KUMAR.G Says:
  2. మీ స్పందనకు ధన్యవాదాలు.తప్ప కుండా సాయం చేదాం

     
  3. Anonymous Says:
  4. good work by geevani. we will defintly help you.

     
  5. Unknown Says:
  6. good work by geevani. we will defintly help you.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo