గాంధీ జయంతి రోజున కర్నూల్ నగరాన్ని వరద ముంచెత్తింది. నేను ఇంకా పేపర్ కూడా చూడలేదు. బ్లాగులు చూస్తుంటే రౌడీ రాజ్యంలో భరద్వాజ గారు వరద బాధితులకోసం మీరు ఏమైనా చేస్తున్నారా అంటూ అడిగారు. చేయగలిగినంత ఆర్థిక సామర్థ్యం మన సంస్థకు ఎక్కడ ఉంది అని నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. భరద్వాజ గారు చూస్తుండగానే విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. 10 గంటల సమయంలో జీవని యూత్ సభ్యుడు రఘు ఫోన్ చేసి, అన్నా వరద బాధితులకోసం ఏమైనా చేద్దాం అని అన్నాడు. సరే బియ్యం పాత బట్టలు సేకరించి ఒక లారీకి పంపుదాం ఈ మాత్రం ఖర్చుకు ఎవరో ఒకరు ముందుకు రాకపోరా అని అకున్నాను. జీవని సభ్యులందరినీ ఫోన్ లో సంప్రదించాను. అందరూ ఓకే అన్నారు.


మరుసటి రోజు క్లాక్ టవర్ వద్ద టెంటు వేశాము. అయితే మధ్యాహ్నానికల్లా మాకు దిమ్మతిరిగింది జీవని డోనార్లు, సభ్యులు కంటే ఇతర జనాలు పాతబట్టలు గుమ్మరించడం ఎక్కువ అయిపోయింది. చూస్తుండగానే అవి గుట్టలా పేరుకుపోయాయి.


మనుషులు ఎంత వికృతంగా ఉంటారో మరోసారి ఆ రోజు చూశాము. కొందరు ఇచ్చిన బట్టలు అప్పుడే బాత్రూం నుంచి తీసుకుని వచ్చినట్లు నీళ్ళు కారుతున్నాయి. మరికొంతమంది పాత బట్టలను పారవేయలేక పీడ వదిలించుకుందామన్నట్లు ఎందుకూ పనికి రాని బట్టలు పడవేసిపోయారు.( వీళ్ళు జీవనికి సంబంధించిన వ్యక్తులు కాదు ) అవి కనీసం మసి బట్టలుగా లేదా ఇళ్ళు తుడవడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉన్నాయి. అక్కడ పబ్లిక్ కాబట్టి ఎవరు ఇచ్చినా తీసుకోవల్సి వచ్చింది.

కొద్దిసేపటికి జీవని యూత్ బ్రిగేడ్ అద్యక్షుడు సతీష్ వచ్చి అన్నా పిల్లలు పాపం పేటలో మరో కౌంటర్ ప్రారంభించాలని ఉత్సాహపడుతున్నారు అని చెప్పాడు. కేవలం బియ్యం మాత్రమే సేకరిద్దాం అని నిర్ణయించుకుని సరే అని చెప్పాము. అక్కడ సురేష్ రెడ్డి, చంద్ర మోహన్ ఆధ్వర్యంలో టెంటు ప్రారంభం అయింది. వీరిద్దరూ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్సే.మూడు గంటల ప్రాంతంలో SREENIVASA RAMANUJAN ENGINEERING COLLEGE CORRESPONDENT సాంబశివారెడ్డి, సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి వచ్చారు. సాంబశివకు పరిస్థితి చెప్పాను. అన్నా ఇవన్ని వద్దుకానీ భారిగా ప్రయత్నం చేద్దాం. కాస్త పై రేంజిలో వ్యక్తులను కదిలిద్దాం. ముందు టెంటు ఎత్తేయండి అన్నట్లు చెప్పాడు. వెంటనే అక్కడ స్కూలు మూసేసి అందరం సమావేశం అయ్యాము. జీవని సలహామండలి చైర్మన్ జగదీశ్వర రెడ్డితో మాట్లాడాము. ఆయన 50 వేల వరకూ హామీ ఇచ్చాడు. ఇక కార్యక్రమం ఊపు అందుకుంది. ఇక అప్పుడు మొదలైంది అగ్రెసివ్ స్టెప్. సాంబశివ స్వతహాగా బాగా ధైర్యస్థుడు, ప్రాక్టికల్ కూడా. మరుసటి రోజు కర్నూల్కు ఓ 3000 వేలమందికి ఆహారం పంపాలని ప్రణాలిక సిద్ధం అయింది. అందరం ఆ పనిలో పడ్డాము.

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

 1. జనాలకు బాగుపడండని దేవుడు ఎన్ని నిదర్శనాలు (కర్నూలు దుర్ఘటన) చూపిస్తున్న మారరు. పాత బట్టల విషయం చాలా బాధ కలిగించింది.

   
 2. Hi,

  I am Suresh Reddy Miduthuru.
  It is a Fantasstic work done by Jeevani in helping the Flood victims.

  Everybody done a Great job for this Grand Success of Jeevani's Contribution Towards Kurnool flood victims.

  Me and Chandramohan thought to open the Second counter in our Papampeta After consulting our friend Gaddam Satish ('Jeevani Youth Brigade' President).
  Really,we didnot expected such Huge response from People.really,it is a great success.

  for this Success lot of people done a great hard work.
  Here i am not able to Mention all of their names but Some of them Are,

  G.Satish,Raghavendra Naidu,Mahesh,Kalyan,Suresh,Chandra mohan,sivaprasad,K.Satish,Baba,Amarendra.......

  And also,one more thing to say about Youth of our Locality who helped a lot for this Success in papampeta.I am thankful to all of them.

  Thanks to everyone who contributed for this Grand Success....

  At last,i am very thankful to S.V Prasad anna for Providing us to take part in this.

  Thank you very much S.V Anna.

  All the Best to Jeevani For the Future.....

  Bye....

  Yours,

  Suresh Reddy Miduthuru......

   

Blog Archive

Followers