జీవని సంస్థకు చేయూతనిస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు. రకరకాల రూపాలలో వీరంతా విరాళాలు అందిస్తున్నారు. ఒకేసారి డబ్బు ఇస్తున్నవారు, ఆరు నెలల చందా ఒకసారి ఇస్తున్నవారు ఇలా వారి వీలును బట్టి సేవ ద్రుక్పథంతో సహాయపడుతున్నారు.

మన సంస్థ కాన్సెప్ట్ లో భాగమైన 100/- పథకానికి మంచి స్పందన వస్తోంది. ఒక కొత్త వ్యక్తికి మన సంస్థ గురించి చెప్పినపుడు వారు స్పందించడమే కాకుండా తన ద్వారా మరి కొందరిని చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చాలా మందికి సేవ చేయాలనే ఉద్దేశ్యం ఉంది, అయితే తాము అందించిన డబ్బులు దుర్వినియోగం అవుతాయేమో అన్న భయం వారిలో ఉంది.

ఇప్పుడు ఉన్న సంస్థలు చాలావరకు సరైన న్యాయం చేయలేకపోవడం వల్ల ఎందరి సేవలనో సమాజం కోల్పోతోంది. అందుకే మన నుంచే దాతలలో నమ్మకాన్ని నెలకొనేలా చేద్దాం.

ముందునెల ఖర్చుపెట్టిన వాటి బిల్లులను రేపు బ్లాగులో పెడుతున్నాము.


Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers