నిన్నటి రోజు భాస్కర్ అనే అబ్బాయిని జీవని సంస్థ అక్కున చేర్చుకుంది. ఈ బాబుకు 6 సంవత్సరాలు. తల్లిదండ్రులు చిన్నపుడే చనిపోయారు. అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప అనే ఊరికి చెందినవాడు. ఈ అబ్బాయి ఫోటోను వీలైనంత తొందరగా బ్లాగులో ఉంచుతాము.
అలాగే నిన్న పిల్లలకు ఒక్క్కొక్కరికి 9 జతల బట్టలు పంపిణీ చేశాము.ఈ కార్యక్రమం సాదాసీదాగా దాతల సమక్షంలో జరిగింది. జీవని సంస్థకు సంబంధించిన కార్యక్రమాల్లో వీలైనంతవరకు వేదిక లేకుండా చూడాలన్నది మన ఆశయం. వ్యక్తులు కాకుండా సంస్థ ఫోకస్ కావలన్నదే మన లక్ష్యం. ఎలాంటి మీటింగులు జరిగినా డయాస్, ఊకదంపుడు కబుర్లు, సొంత డబ్బా , పొగడ్తలు, వ్యక్తి పూజ,వ్యక్తుల ప్రచారం మొదలైన వాటిని పూర్తిగా అరికట్టాలని మన ఉద్దేశ్యం. తప్పని సరిగా విధి లేని పరిస్థితుల్లో మాత్రమే డయాస్ అన్నది కార్యక్రమంలో ఉంటుంది. అన్నిటిని ప్రక్షాళన చేసుకుంటూ మనకంటూ ఒక స్వచ్చమైన వ్యవస్థను నెలకొల్పే దిశగా వెళ్తున్నాం. అందుకే ప్రతి అంశాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించి, అన్ని రకాల జాడ్యాలను సమూలంగా తొలగిస్తున్నాం. కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను కూడా వీలైనంత త్వరలో బ్లాగులో ఉంచుతాము.NAME : JEEVANI VOLUNTARY ORGANISATION
BANK : ICICI
A/C NO : 043905000999
TYPE : CURRENT ACCOUNT
BRANCH : ANANTAPUR


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers