మిత్రులారా, ఈ నెల 26న చివరి ఆదివారం సమావేశం నిర్వహిద్దాం అని అనుకుంటున్నాం. వేదిక ఎన్.జీ.ఓ హోం, అనంతపురం, 10-1 గం. వరకు. ఇది టెంటేటివ్ మాత్రమే. ఈ వారం ఆఖరుకు ఖరారు అవుతుంది. జీవని సభ్యులు అందరూ తప్పక హాజరు కావల్సిందిగా మనవి. అలాగే ఎవరైనా మిత్రులు వస్తే తప్పక తీసుకురండి.మీటింగ్ ఇలా నిర్వహిద్దాం అనుకుంటున్నాం. మీకు ఏవైనా లోటుపాట్లు కనిపించినా, మరేదైనా ఆలోచన వచ్చినా మార్పులు చేర్పుల గురించి దయచేసి తెలియజేయండి.


100-150 మంది హాజరు అవుతారు.

వేదిక లేదు. పిల్లలు మాత్రమే వేదిక మీద ఉంటారు.

ఎవరు మాట్లాడవలసినపుడు వారు మాత్రమే మైకు దగ్గరకు లేదా వేదిక మీదకు వెళ్తారు.
జీవని కార్యకర్త సంస్థ గురించి 5 ని. మాత్రమే మోటివేషనల్ క్లాస్ తీసుకుంటాడు.

ప్రధాన కార్యదర్శి ఇంత వరకు జరిగిన కార్యక్రమాలపై నివేదిక సమర్పిస్తాడు.

జీవని సలహా సంఘం చైర్మన్ జీవని భవిష్యత్ కార్యక్రమాలపై వివరణ ఇస్తాడు.

ఆ తర్వాత అందరికీ అవకాశం. ఎవరైనా మాట్లాడవచ్చు.

కానీ వారి ప్రసంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత పొగడ్తలు, సంస్థపై పొగడ్తలు ఉండకూడదు.

జీవని సంస్థ వ్యక్తిగతమైన ఫోకస్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది.

ఇది అందరి సంస్థ సేవా దృక్పథం ఉన్నవారికి ఇది ప్లాట్ ఫాం అని సవినయంగా మరోసారి విన్నవించుకుంటున్నాం.

జీవని సంస్థ విస్తరణకు, పిల్లలకు మరింత సేవ చేసే అవకాశాల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది.

బోరు కొట్టించే ప్రసంగాలు, పూలమాలలు, పొగడ్తలు... వీటికి భిన్నంగా మన కార్యక్రమం జరపాలని అనుకుంటున్నాం. చివరగా పిల్లలతో మాట్లాడించడం మరియు పిల్లలతో సభ్యుల ఇంటరాక్షన్.

మిత్రులారా ఇదీ ఒక రఫ్ ప్రణాళిక. దీనికి సంబంధించిన మీ సలహాలను సూచనలను కోరుతూ.....
Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

1 Responses to జీవని సర్వసభ్య సమావేశం

  1. sahavaasam Says:
  2. excellent innovation for orphan children. jeevani always jeeeeeeevani

     

Blog Archive

Followers