మిత్రులారా నిన్నటిరోజు పిల్లలను స్కూలుకు దగ్గరలోని రాజీవ్ చిల్డ్రన్ పార్క్ కు తీసుకువెళ్ళాం. అందరూ ఆనందంగా ఆడుకున్నారు. అంతకు ముందే కొద్దిపాటి వర్షం వచ్చింది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. లైటింగ్ సరిగాలేక కేవలం రెండు ఫోటోలు మాత్రమే తీశాము. టేచర్ రాధిక గారు పిల్లలకు తినుబండారాలు తెచ్చారు. ఆమె పిల్లలకు కొసరి కొసరి తినిపించారు. ఊయలలో ఊగించి జారుడుబల్లపై ఆడించారు. మరో టీచర్ రవి కుమార్ పిల్లలకు ఐస్ తెచ్చి ఇచ్చాడు. పిల్లలు తృప్తిగా ఆనందంగా తిరిగి స్కూల్ హాస్టల్ చేరుకున్నారు.


అప్పుడు మాకో ఆలోచన వచ్చింది. ప్రతి నెలా రెండో ఆదివారం పిల్లల్ని పార్క్ తీసుకువెళ్తాం. అనంతపురంలో ఉన్న జీవని సభ్యులు ఒకోరు ఒకసారి తమ పిల్లల్ని కూడా తెచ్చి వీరితో గడిపితే బావుంటుంది అని.

Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

1 Responses to పిల్లలతో ఓ సాయంత్రం

  1. sahavaasam Says:
  2. NITYAM SAMASYALATHO SATHAMATHA MAYYE MANAVALOKAMLO, SWARTHA CHINTHANATHO MANUGADA SAGINCHE MANAVAALI LO,NISWARTHA THO NEEVU CHESTHUNNA EE SEVA YAZNAM MUNDUKU MUNU MUNDUKU SAGALANI ASISTHU .........SAHAVASAM

     

Blog Archive

Followers