మిత్రులందరికీ నమస్కారం,


వర్షాలు పడకపోవడంతో రైతన్నలు ఆదోళన చెందుతున్నారు. అదను దాటిపోతుందేమోనని భయపడుతున్నారు. రుతుపవనాలు అదిగోఇదిగో అంటున్నాయి. వర్షాలు రావాలని అందరం కోరుకుందాం.

ఇక మన విషయానికి వస్తే, హోం సిక్ హాలిడేస్ కోసం ఇళ్ళకు వెళ్ళిన పిల్లలు ఈ రోజు తిరిగి వస్తున్నారు. అందరికి డ్రస్సులు ఈ రోజు అందజేస్తున్నాం. ఒక్కొక్కరికి 9 జతలు. 6 స్కూల్ డ్రస్సులు మరియు 3 కలర్ డ్రస్సులు.

నెలాఖరు కావడం వల్ల విరాళాల సేకరణ మందగించింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. జీవని సంస్థకు రామమోహన్ రెడ్డి గారు (Inspector, Customs and central exercise dept. hyderabad) 1000/- విరాళం ఇచ్చారు. దీంతో మొత్తం బ్యాలన్స్ 6596/- అయింది. నెలవారీ విరాళాలు ఇచ్చే వారి సంఖ్య ఇంకా తేలలేదు. కనీసం ఈ వారం ఆఖరుకు లిస్టు ఒక రూపానికి వస్తుంది.Join hands with...

JEEVANI
......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers