Anonymous said...
Hello

I appreciate all your efforts helping orphan kids. Posting every donation online improves your credibility and accountability. Thank you so much for doing this for our country.

Please allow me to share my thoughts to make this as much better effort. It would nice to see each kid as a respectable individual than seeing it as a social service concept. I encourage you to introduce each kid with details like where they came from, their back ground, their current social, civic, mental adaptability.
- Are they feeling any loneliness?
- How are they progressing with education and in socialskills.
- What kind of care you are taking shaping them as educated, social, moral citizens of India.

Do you need any help from society(from us) in making them well educated, good moral citizens.

I think your responsibility is much more than just feeding them and giving them shelter.


Once again Thanks for such a wonderful job you guys doing there.
Indian.
August 28, 2012 7:40 PM

పై కామెంటుకు సమాధానం పోస్టు రూపంలో పెడితే ఎక్కువ మందికి స్పష్టత ఇవ్వవచ్చని ఈ ప్రయత్నం. ముందుగా అఙ్ఞాత గారికి ధన్యవాదాలు. 

పిల్లల నేపథ్యం గురించి రాయాలంటే కార్యవర్గసభ్యుల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. నెట్లో పిల్లల పూర్తి వివరాలు వుంచడం బావుంటుందా? మాకైతే క్లారిటీ లేదు. ఇవ్వొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే వారి వివరాలు పోస్ట్ చేయగలం. దీనిపై బ్లాగర్లు సూచనలు ఇవ్వాల్సిందిగా మనవి.

ఇక పిల్లలకు ఒంటరితనం అన్న సమస్యే లేదు. 5 సంవత్సరాల పిల్లలు కూడా ఇంటి మీద ధ్యాస లేకుండా ఇక్కడ సంతోషంగా ఉంటున్నారు. ( ఇల్లు అంటే వారి అవ్వాతాతలు, పెదనాన్న, మామ ఇలాంటి వారు అన్నమాట ) 

చదువు, సామాజిక బాధ్యతకు సంబంధించినంతవరకు మాకు ఇంకో నెల సమయం కావాల్సి ఉంటుంది. ప్రాథమికంగా ఉన్న ఇబ్బందులు తోలగిపోతే దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని మొదలుపెడతాము. మేము ప్లాన్ చేసింది ఏమంటే ప్రతి వారం వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను పిల్లలతో ఇంటరాక్ట్ చేయించడం. నైతిక విలువలు లాంటి అంశాలపై క్లాస్లు చెప్పించడం. ప్రతి రోజూ పుస్తక పఠనానికి సమయం కేటాయించడం. పంచతంత్ర కథలు, చందమామ ఇలా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచడం. 

చదువు విషయానికి వస్తే మొత్తం ముగ్గరు ట్యూటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫాకల్టీలు. పిల్లలకు ఉచితంగా బోధిస్తుంటారు. ఒకరికి మాత్రం డబ్బు చెల్లిస్తున్నాము. 
స్కూల్లో చదువు మాకు సంతృప్తికరంగా లేదు. పిల్లలు కాన్సెప్ట్ లేకుండా గుడ్డిగా బట్టీ పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే విద్యా సంవత్సరానికి సొంత స్కూల్ చిన్నదైనా ప్రారంభించాలని అనుకుంటున్నాము. అయితే ఇందుకు ఆర్థిక వనరులు సమకూరాలి.  

అఙ్ఞాత గారు సమాజం వైపు నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు అని అడిగారు. మీకు మరోసారి ధన్యవాదాలు. అనంతపురంలో మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారిని జీవనికి పంపి పిల్లలతో మాట్లాడేలా చేయడం.  మంచి పుస్తకాలు డొనేట్ చేయడం. 

పిల్లలందరూ గ్రామీణ వాతావరణం నుంచి, ఎలాంటి కేర్ లేని స్థితి నుంచి వచ్చారు. వీరు ముందుగా పరిశుభ్రత, బాధ్యతగా ఉండటం, చక్కని మాట తీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని కూడా ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేదు. ఇన్నాళ్ళూ బయటి హాస్టల్లలో ఉన్నారు కాబట్టి మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇప్పుడు వీటిపై దృష్టి పెట్టాము. 

పిల్లలకు కేవలం షెల్టర్ ఇవ్వడం జీవని ఉద్దేశ్యం కాదు. వారిని మంచి పౌరులుగా, సేవా దృక్పథం కలిగినవారుగా తయారుచేయడమే లక్ష్యం. 

మీ అందరి సహాయ సహకారాలకు మరోసారి ధన్యవాదాలతో

మీ 
జీవని 


DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 1000/-  28,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  21,022/-
03-9-12-  expenditure milk 3350/- 17672/- 
04-9-12- 
05-9-12- 
06-9-12- 
07-9-12- 
08-9-12- 
09-9-12- 
10-9-12- 
11-9-12- 
12-9-12- 
13-9-12- 
14-9-12- 
15-9-12- 
16-9-12- 
17-9-12-
18-9-12- 
19-9-12-
20-9-12-
21-9-12-
22-9-12- 
23-9-12-
24-9-12-
25-9-12-
26-9-12- 
27-9-12-
28-9-12- 
29-9-12-
30-9-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-



on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo