జీవనిలో ఉన్న పిల్లల పుట్టిన రోజులకు సంబంధించి ఒకటి అనుకున్నాము. జీవని ఆవిర్భవించిన రోజున అందరికీ కామన్ గా బర్త్ డే జరుపుదాం అని. కానీ మిత్రులు సాల్మన్ రాజు అందరి బర్త్ డేలకు నేను కేక్ తెచ్చి సెలెబ్రేట్ చేయిస్తాను. ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది అన్నారు. దీనికి అందరూ ఒకే అన్నారు. జీవని పిల్లల బర్త్ డేను మొదటిసారిగా నిన్న జరిపాము. కడపలో ఒక కానిస్టేబుల్ ( పూర్తి వివరాలు తెలియదు, ఈనాడు ఆదివారం సంచికలో వచ్చిందట ) ఇలా తల్లిదండ్రులు లేని పిల్లల పుట్టినరోజులు జరుపుతుంటారట. ఆ ఆర్టికల్ సాల్మన్ ను కదిలించింది. తాను కూడా అలా చేయాలని నిర్ణయించుకున్నారు. నిన్న మెహతాజ్, గణేష్ పుట్టినరోజు జరిపాము. 
మా అందరికీ ఆత్మీయ మిత్రులైన సాల్మన్, వారి కుటుంబసభ్యులను దేవుడు   చల్లగా చూడాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. 












పుట్టినరోజు జరుపుకున్న మెహతాజ్,గణేష్ లతో సాల్మన్ దంపతులు, వారి పిల్లలు, సోదరుని పిల్లలు. 






























పై చిత్రంలోని సార్లు పిల్లలకు ట్యూటర్లు. రానూపోనూ ఇబ్బంది ఉన్నా పిల్లలకు ఉచితంగా విద్యను చెప్పిస్తూ సేవలో పాలుపంచుకుంటున్నారు.   వీరిద్దరూ SRIT మరియు శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్నారు. 




on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Dev Says:
  2. Really appreciated efforts....

     
  3. jeevani Says:
  4. thank you DEV

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo