జీవనిలో మొదట బోరు వేసినపుడు రెండున్నర ఇంచి నీళ్ళు పడిన విషయం అందరికీ తెలుసు. ఆ బోరు ద్వారా ఇక్కడి రోటరీపురం గ్రామానికి ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఈ సమస్య తెలుసుకున్న జీవని ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివా రెడ్డి నీటి సరఫరాకు పైపు లైను వేయించారు. తర్వాత నీటి అవసరాల దృష్ట్యా మరో బోరు వేయించడం జరిగింది. ఈ సారి బోరులో 4 ఇంచులు పడటం విశేషం.

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers