కాకినాడ అంటే కాజా గుర్తొచ్చేది... ఒకప్పుడు
మిధునం అంటే అప్పదాసూ బుచ్చి లక్ష్మీ గుర్తొచ్చేవారు... ఒకప్పుడు
జాటర్ ఢమాల్ అంటే బుడుగు గుర్తొచ్చేవాడు... ఒకప్పుడు.... ఒకప్పుడు.!

పుస్తకాల పండగొస్తే.. మనకెదురొస్తారతను.
మా పుస్తకాల అర చూస్తే.. కనిపిస్తారతను..!

పిల్లాడిలా అల్లరి చేసినా..అతనే
పెద్దోడిగా బుద్ధులు చెప్పినా..అతనే..

అలవోక గా పేరడీలు రాసినా.. అతనే
అవలీల గా సెటయిర్లు వేసినా.. అతనే..
గ్రీన్ టీ గ్లాస్ చూసినా అతనే...
సిట్రా డ్రింక్ సీసా తీసినా అతనే...

మేము నవ్విన నవ్వుల్లో, పంచుకున్న ఆనందాల్లో, అందుకున్న జ్ఞాపికల్లో, నెమరేసుకొనే మధుర జ్ఞాపకాల్లో... మా జీవితాల్లో .... మా హృదయాల్లో.. ఎప్పటికీ... అతనే..!  

                                                                                                       - courtesy : Raj Kumar ( blogger )




కొద్ది నెలల కిందట బ్లాగర్ శంకర్ గారు మనల్ని వదిలి వెళ్ళిన  విషయం తెలిసిందే.
శంకర్ గారి స్మృత్యర్థం వారి శ్రీమతి స్వాతి గారు జీవనికి 15,000/- విరాళం అందించారు.
మరో నెలరోజుల్లో జీవనికి వస్తాను అని ఆనాడు  చెప్పి వాగ్దాన భంగం చేసి సుదూరతీరాలకు వెళ్ళిన శంకర్ గారి ఆత్మశాంతి కోరుతూ...
వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పిల్లల తరఫున దేవుడిని ప్రార్థిస్తూ...

జీవని 





on
categories: | edit post

14 వ్యాఖ్యలు

  1. మేము నవ్విన నవ్వుల్లో, పంచుకున్న ఆనందాల్లో, అందుకున్న జ్ఞాపికల్లో, నెమరేసుకొనే మధుర జ్ఞాపకాల్లో... మా జీవితాల్లో .... మా హృదయాల్లో.. ఎప్పటికీ... అతనే..!

    బాగా చెప్పావు రాజ్ వాడి గురించి ఇంతకంటే గొప్పగా చెప్పడం కష్టమే

     
  2. స్వాతిగారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.

     
  3. మనసు భారంగా ఉంది.ఏమి చెప్పలేను :(ఏడుపు వస్తుంది

     
  4. మనసు భారంగా ఉంది.ఏమి చెప్పలేను :(ఏడుపు వస్తుంది

     
  5. స్వాతి గారికి థాంక్స్ చెప్పాలి..అవును చాణక్యా...

     
  6. స్వాతి గారికి ధన్యవాదాలు.

    మనందరి మనసుల్లోని మాట చెప్పావు రాజ్..

     
  7. Unknown Says:
  8. ఆ మంచితనానికి జోహార్లు

     
  9. స్వాతి గారికి అభినందనలు.

    బాగా చెప్పావు రాజ్

     
  10. స్వాతి గారికి అభినందనలు.

    రాజ్ చాలా బాగా చెప్పారు. శంకర్ ని మర్చిపోలేము. మా ఉహల్లో హృదయాలలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు.

     
  11. స్వాతి గారికి ధన్యవాదములు

     
  12. చాలా బాగా చెప్పావు రాజ్...
    స్వాతిగారికి ధన్యవాదాలు.

     
  13. చాలా బాగా చెప్పావు రాజ్...
    స్వాతిగారికి ధన్యవాదాలు.

     
  14. jeevani Says:
  15. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు

     
  16. జీవని కుటుంబం తరుపున ధన్యవాదాలు స్వాతి గారు..

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo