

Ashok Chowdary - $50
Bhavana - $100
Buchibabu B. - $20
Bhaskara Rami Reddy - $50
Panipuri - $50
Shashank - $116
Malakpet Rowdy - $100
Anagha (Baby Rowdy) - $25
Manchu Pallaki - $50
Swetha Gunna - $151
Bhaskara Ramaraju - $116
Naveena Gummadi - $100
Nishigandha - $100
Anonymous - $50
Venkat Dasika - $50
Ekalingam - $50
RK - $50
Sarat - $50
Padma (Mohanaraagaalu) - $100
Janardhan Bonu - 150$ ( Directly to Jeevani )
Ranjit Devadas - $50
Ravi Piriya - $100
kathasv@gmail.com
మిత్రులారా నిజానికి ఈ ఉదయంకల్లా నివేదిక తయారు చేద్దాం అని అనుకున్నాం. మూడు రోజులపాటు జీవని స్వచ్చంద సంస్ఠ , SRIT సమ్యుక్తంగా నిర్వహించిన వరద బాధితుల సహాయ కార్యక్రమాన్ని సమగ్రంగా మీకు తెలియజేస్తాము. మా సభ్యులు నిన్న వ్యక్తిగత కారణాల వల్ల బిజీగా ఉన్నారు. అందుకే మేము కలవలేకపోయాము. ప్రస్తుతానికి కొన్ని ఫోటోలు ఇందులో ఉంచుతున్నాము గమనించగలరు.





మిత్రులారా, కర్నూల్ కు 40 కిలో మీటర్ల దూరంలోని గుండ్రేవుల గ్రామానికి మనం నిన్న సహాయం చేయడం జరిగింది. పూర్తి వివరాలను, జమాఖర్చులను నివేదిక రూపంలో మీ ముందు ఉంచుతాము. ఐతే మేము పూర్తిగా అలసిపోయి ఉన్నాము రేపు ఉదయంకల్లా తయారు చేస్తాము. ఇపుడు ఒకటి రెండు విశేషాలను మీతో పంచుకుంటాము. 350 ప్యాకెట్లు అనుకున్నాము కదా చివరకు 400 చేశాము. అందరికీ అందాయి. మా కష్టానికి, మీ వితరణకు సంపూర్ణమైన న్యాయం జరిగింది. ఆ గ్రామంలో వదరలో చిక్కుకున్న 400 మందిని కేవలం నలుగురు తెప్పల ద్వారా రక్షించారు. మన పంపిణీ ఆ నలుగురు మానవతా మూర్తులతోనే ప్రారంభించాము. వారి పేర్లు కనుక్కోలేకపోయినందుకు, వారి సాహసానికి అదనంగా ఆర్థిక సహాయం చేయనందుకు తీవ్రంగా బాధపడుతున్నాము. చీకటి కావడంతో మా సర్వశక్తులు పంపిణీ మీదే పెట్టాము. ఈ రోజు మాకు ఇది తట్టింది. పూర్తి వివరాలు త్వరలో... అలాగే జీవని కృషి పట్ల సంతృప్తితో, నమ్మకంతో విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఈ ఆదివారం మరో క్యాంప్ కోసం మేము సిద్ధం అవుతున్నాము. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఈ రోజు ఖరారు చేస్తాము. విరాళాలు పెరిగినట్టల్లా మన కార్యక్రమం మరింత ఎక్కువమందికి లబ్ది చేకూరుస్తుంది. కాబట్టి విరాళాలకు ముందుకురవలసిందిగా కోరుతున్నాము.
మిత్రులారా బాధితులకు మీరూ చేయూతను ఇవ్వాలంటే NRIలు bharadwaja@yahoo.com కు, ఇక్కడి వారు jeevani.sv@gmail.com or 9948271023ను సంప్రదించండి. మన సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మేము వివరించే అంత సమయం దొరకడం లేదు. కాబట్టి ఫోటోలను మాత్రమే ఉంచుతన్నాము.



మిత్రులారా కర్నూల్ వరద బాధితులకోసం ఈ రోజు రేపు అనంతపురం క్లాక్ టవర్ వద్ద జీవని సంస్థ ఒక కౌంటర్ ను ప్రారంభిస్తోంది. మీ మిత్రులు బంధువులు ఎవరు ఉన్నా దయచేసి వారికి తెలియజేయండి. మన ఇంట్లో వృధాగా పడి ఉన్న దుప్పట్లు ఇప్పుడు అత్యవసరాలుగా మారాయి. కాబట్టి మీకు సంబంధించిన వారికి తెలిపరిచి మరి కొంతమందికి సమాచారం పంపమనండి. తాజా సమాచారం ప్రకారం అక్కడికి కావలసినవి దుప్పట్లు, టవాళ్ళు, నిత్యావసర వస్తువులు. నిన్న మనం దాదాపు ఓ పదివేలమందికి మెసేజ్ పంపించాము. అలాగే తెలుగు బ్లాగర్లు సహాయం చేసెట్లు అయితే భారతదేశానికి సంబంధించినంతవరకు విరాళం ఇవ్వడానికి ramanisreepada@gmail.com, ఇతర దేశాల్లోని భారతీయులు bharadwaja@yahoo.com సంప్రదించండి.
ABOUT JEEVANI...
quick view : JEEVANI is an orphanage. Giving shelter to 37 parentless children. It is located in Rotary puram village, Bukkaraya samudram mandal, Anantapur district, Andhra pradesh, Indiacontact : jeevani.sv@gmail.com, phone: +91 9440547123


Join hands with...
మిత్రులారా నిన్నటి రోజు అశోక్ (5) అనే అబ్బాయిని మనం తీసుకోవడం జరిగింది. ఈ పిల్లవాడి అమ్మను వాళ్ల నాన్న హత్య చేసి చంపి పారిపోయాడట. అవ్వా తాతలు వాడి ఆలనాపాలనా చూసేవారు. ఈ అబ్బాయిది కర్నూల్ జిల్లా ఆదోని.































