రోగం కంటే దానికయ్యే ఖర్చే ప్రాణం మీదకు తెస్తున్న రోజులు. జలుబు కోసం పోతే ఆపాదమస్తకం పరీక్షలు చేసి నిలువు దోపిడీ చేస్తున్న కాలం. మా అనంతపురంలో పొద్దున్నే 4 గంటలకు టోకెన్లు ఇచ్చే డాక్టర్లు, ఫోన్లో బుక్ చేస్తే ఒక రేటు, వ్యక్తిగతంగా వెళ్తే ఒకరేటు, సమయం దాటితే మరో రేటు, 6 నెలల తర్వాత టోకెన్లు ఇచ్చే మహానుభావులు కూడా వున్నారు ( ఈలోపు పేషెంట్ గతి ఏమి కాను ! ) కానీ నాణానికి ఒక వైపే కాదు కదా... రెండో వైపు కూడా ఉన్నారు. కనీసం రెండో మందు రాయాలన్నా మరోసారి ఆలోచించే డాక్టర్లు ఉన్నారు. పేదల పరిస్థితిని బట్టి చాలా తక్కువ అసలు తీసుకోనివారు కూడా ఉన్నారు. కానీ విచిత్రమేమంటే వారి దగ్గరకు చాలా తక్కువ మంది పేషెంట్లు వెళ్తుంటారు. నిలువుదోపిడీ దగ్గర క్యూ ఎక్కువ ఉంటుంది.
అనంతపురంలోని కొంతమంది మంచి డాక్టర్లను ఒకసారి స్మరించుకుంటే సంతోషం అనిపిస్తుంది. మానవత్వాన్ని ఒకసారి కౌగిలించుకున్నట్లు అనిపిస్తుంది. చిన్న పిల్లల డాక్టర్లు సదాశివరావు,  శివాజీ గార్లు. ప్రస్తుత MLC గేయానంద్ గారు వారి సతీమణి ప్రసూన గారు. ఎముకల డాక్టర్ భానుకిరణ్ గారు ... ఇంకా ఇంకా మరికొంతమందే ఉన్నారు.  
ఇది పాత తరం, కాస్త పెద్దవారు. ఈ తరం డాక్టర్లలో ఒక శిఖరం మా సోదరుడు డాక్టర్ హరి ప్రసాద్, జీవని పిల్లలకు ఆరోగ్యదాత హరి. ఒక రూపాయి కూడా అడ్వాన్సు కట్టించుకోకుండా ఆపరేషన్ చేస్తాం మన ఆస్పత్రిలో అని హరి అన్నపుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉన్నట్టుండి ఆధ్యాత్మికంలోకి జారుకుంటూ మరింత సేవ చేయాలి అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లల సర్జన్ అయిన హరి నిన్న ఒక అరుదైన ఆపరేషన్ చేశాడు ఉచితంగా. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయురారొగ్యాలు సుఖసంతోషాలు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. హరి సేవలు ఇంకా విస్తృతం కావాలని కోరుకుంటున్నాము.

ఆయన ఆస్పత్రి పేరు చిన్నారి హాస్పిటల్. సాయినగర్.





on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo