విద్యారంగంలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ వాల్మీకి గ్రూప్ CMD గణేష్ వాల్మీకి గారు కొన్ని నెలల కిందట జీవనికి వచ్చారు. జీవని నిర్వహణ విధానం ఆయనను బాగా ఆకట్టుకుంది. మీకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజానికి వారు కూడా వాల్మీకి హృదయ్ పేరుతో ఒక ఆశ్రమం హైదరాబాద్లో నడుపుతున్నారు. వారు 20 మంది పిల్లలకు నీడనిస్తున్నారు. వారు తమ కుటుంబసభ్యులతో జీవనిని సందర్శించిన రోజున నేను హైదరాబాద్ వెళ్ళాను. సరే ఈ రోజు గణేష్ గారి సోదరుడు కిషన్ వాల్మీకి గారు ఫోన్ చేసి నేను అమ్మను తీసుకుని జీవని వస్తున్నాను అని చెప్పారు. తీరా వచ్చాక చూస్తే కిషన్ నా పాత మిత్రుడు. డిగ్రీ చదివే రోజుల్లో ఇంగ్లీషులో బలపడాలని స్పోకెన్ ఇంగ్లీష్ వెళ్ళాను. కోర్సు అయిపోయింది. మన ఇంగ్లీషు మన మన దగ్గరే ఉంది. అది వేరే విషయం. అక్కడ కిషన్ పరిచయం. అన్నట్టు కిషన్‌కు స్టాంపులు, వివిధ కరెన్సీ సేకరించడం హాబీ. మూడు సార్లు LIMCA బుక్ ఆఫ్ రికార్డు ఎక్కాడు. అనంతపురంలోని ప్రభుత్వ మ్యూజియంకు తన సేకరణలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. వాల్మీకి హృదయ్ ఎలా నడుపుతోంది, భవిష్యత్తు ప్రణాళికలు, జీవనితో కలసి కొన్ని ప్రాజెక్టులు చేయడం వంటి అంశాలపై చర్చించాము. దాదాపు 20 ఏళ్ళ తర్వాత కిషన్‌ను కలవడం సంతోషం అనిపించింది. ఇందుకు కారకులైన వారి సోదరుడు గణేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 
on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers